వేములవాడ ఆలయంలో
నూతనంగా ప్రవేశ పెట్టిన పూజలు !

(J. SURENDER KUMAR)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన పూజల వివరాలు ఇలా ఉన్నాయి..
దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి వేములవాడ భక్తుల సౌకర్యార్ధము నూతనముగా ప్రవేశపెట్టిన పూజ వివరములు
,


1) పుట్టువెంట్రుకలు తీయించుకొనువారు పూజ జరిపించుకొను (నూతనముగా పుట్టు వెంట్రుకలు చేసుకొనే వారికి. (ప్రతి రోజు ఉదయం గం. 7.00 ల నుండి గం.11.00 లోపు వరకు) .టికెటు రుసుము రూ.251-00.

2) శ్రీ స్వామివారి ఆలయప్రాంగణములో గల శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము ( ప్రతి రోజు ఉదయం గం.6.30 ల నుండి

గం.11.00 ల వరకు టికెటు రుసుము రూ.251-00.

3) ఆలయ ప్రాంగణంలో ని శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకము (ప్రతి రోజు ఉదయం గం.8.00 ల నుండి గం.11.00 ల వరకు టికెటు రుసుము రూ.251-00.

4, వేదోక్త ఆశీర్వచనము టికెటు రుసుము రూ.1,000-00
టికెటు సమాచార కేంద్ర విభాగము ( P.R.O కార్యాలయము నందు లభించును.) .ప్రతి రోజు ఉదయం గం.6.00 ల నుండిరాత్రి గం.8.00 ల వరకు) వివరాల అందుబాటులో ఉంటాయని దేవస్థానం ప్రకటనలో పేర్కొంది.