( J.Surender Kumar)
నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా లో కోట్ల రూపాయలతో ఆధునిక హంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు, రహదారులు, ప్రాంగణాలను, రంగు రంగుల విద్యుత్ దీపాలతో యంత్రాంగం అందంగా ఏర్పాటు చేశారు.

అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతితో జిగేల్ గా కనిపిస్తున్న కలెక్టరేట్ భవన సముదాయాన్ని చూడ్డానికి. సోమవారం రాత్రి పట్టణ ప్రజలు తరలివస్తున్నారు.
