(J.Surender Kumar).
శుక్రవారం ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని మొదటి అంతస్తు బాల్కనీ నుంచి ఉపాధ్యాయుని కిందకు త్రోసి వేసింది.
వందన అనే చిన్నారి విద్యార్థిని ఆసుపత్రిలో ఉందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వివరించారు. చెప్పారు. ఉపాధ్యాయుని గీతా దేశ్వాల్ ను అరెస్టు చేశారు.

ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఉపాధ్యాయుని గీత ఆవేశంతో మొదటి అంతస్తు క్లాస్ రూమ్ బాల్కనీ చిన్నారిని కిందకు తోయడానికి ముందు చిన్నారి వందన పై కత్తెరతో దాడి చేసింది.
మరో టీచర్ రియా జోక్యం చేసుకుని తన సహోద్యోగిని చిన్నారిని కొట్టకుండా ఆపేందుకు ప్రయత్నించింది.
బాలిక మొదటి అంతస్తు నుండి పడిపోయినప్పుడు, ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఫోన్ చేసారు, పోలీసులు తీవ్రంగా గాయపడిన చిన్నారిని బారా హిందూరావు ఆసుపత్రికి తరలించారు.
ఉపాధ్యాయుని సస్పెండ్ చేశామని డిపార్ట్‌మెంట్ ద్వారా తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) సీనియర్ అధికారి (,PTI) వార్తా సంస్థకు తెలిపారు.