ఓటర్లు సైలెంట్ గా ఇచ్చిన షాక్ తో ఓటమి
గుజరాత్ ఎన్నికలలో…
(J. Surender Kumar)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఓ గ్రామంలో గంపగుత్తగా ఓటర్ల సానుభూతి పొంది గెలుపు కోసం పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి నీటి ప్రవాహం వాగులో దూకాడు. అభ్యర్థి విన్యాసం ను వీక్షించిన ఓటర్లు అయ్యో ఇలా చేయడం ఏమిటి అంటూ సానుభూతి వ్యక్తం చేసి అతనిని ఓదార్చారు. ఓట్ల కోసం అభ్యర్థి చేసిన విన్యాసం అవగాహన చేసుకున్న ఓటర్లు అదే పద్ధతిలో అభ్యర్థికి సైలెంట్ గా ఓట్ల రూపంలో షాక్ ఇవ్వడంతో ఓడిపోయాడు.
గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆ అభ్యర్థి ఓడిపోవడంతో, వాగులో దూకిన వదలని ఓటమి అంటూ కౌంటింగ్ కేంద్రాల్లో సెటైర్లు వేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్ అసెంబ్లీ మొదటి విడతఎన్నికలలో రాజుల అసెంబ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అంబరీష్ దేర్ ప్రస్తుతం అదే సెగ్మెంట్లో తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్థి, తన మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తూ. గత నెల 29న నీటి ప్రవాహం వాగులో దూకాడు, ఆయనతో పాటు మద్దతు దారులు కూడా దూకారు. ఈదుకుంటూ సురక్షితంగా ఆ గ్రామానికి చేరుకున్నారు తడిచిన బట్టలతో గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
అమ్రేలి జిల్లా రాజుల అసెంబ్లీ నియోజకవర్గ నుంచి 2017 లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంబరీష్ దేర్, ప్రస్తుతం అదే సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. గుజరాత్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య కురుక్షేత్ర సంగ్రహం తలపించేలా పోటీ నెలకొంది. మూడు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
మంగళవారం ఎన్నికల ప్రచారం ముగిసింది డిసెంబర్ 1న మొదటి దశ పోలింగ్, గత నెల 29 న బహిరంగ సభలు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు లేకుండా గ్రామాలలో గడప గడప కు ప్రచారం చేశారు.
ఆ ఓట్ల కోసం దూకాడా ?

రాజుల నియోజకవర్గంలో విక్టర్ హార్బర్, సమీపంలో సంజ్ బందర్ గ్రామం ఉంది. తీరప్రాంత గ్రామం కావడంతో, విక్టర్ హార్బర్ నుండి . ఈ గ్రామానికి ఫ్లైఓవర్ సౌకర్యం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామ ప్రజలు నీటి గుండా రాకపోకలతో ఇబ్బందులు పడుతున్నారు. .ఈ పరిస్థితిలో ఎమ్మెల్యే అంబరీష్ దేర్, ఫ్లైఓవర్ నిర్మించాలని అధికార బీజేపీని అనేకసార్లు వినతి పత్రాలు ఇస్తూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అధికార బీజేపీ ప్రభుత్వం ఈ గ్రామానికి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ గ్రామ ఓటర్ల సానుభూతి కోసం అంబరీష్ దేర్ అకస్మాత్తుగా తన అనుచరులతో కలిసి వాగు లో దూకాడు. 300 మీటర్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు
ఈ సంఘటన చూసిన ఆ గ్రామ ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇదేంటని ఆయనను ప్రజలు అడిగారు. “గత ఐదేళ్లుగా బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను అంగీకరించలేదు. బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను వినడం లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రజల డిమాండ్లను నెరవేర్చామని ,మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోంది. బీజేపీని ప్రజలు నమ్మొద్దు. దీన్ని ప్రజల్లోకి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే నేను దూకానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబరీష్ దేర్ ప్రజలకు వివరించి, తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని అభ్యర్థించారు. కాంగ్రెస్ నుంచి అంబరీష్ దేర్ పోటీ చేయగా, బీజేపీ నుంచి హీరా సోలంకీ పోటీ చేస్తున్నారు.

2017 లో వీరిద్దరూ పోటీ పడ్డారు. అంబరీష్ దేర్ 12,719 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన హీరా సోలంకీ పై 2017 లో విజయం సాధించారు. ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. వీరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున భరత్ బల్దానియా పోటీలో ఉన్నాడు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉండడంతో నియోజకవర్గంలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందిని ఆలోచించిన కాంగ్రెస్ అభ్యర్థి తన అనుచరులతో ఓట్ల కోసం వాగులో దూకి తడి బట్టలతో ఓట్లు అభ్యర్థించాలనే సానుభూతి చిట్కాను ప్రయోగించినట్లు చర్చ.
డిసెంబర్ 1 మొదటి విడత పోలింగ్ జరిగింది గురువారం ఓట్ల లెక్కించారు.
ఈ సెగ్మెంట్లో బిజెపి అభ్యర్థి హీరాలాల్ సోలంకి 78,482 సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి అంబరీష్ దేర్ కు 68,019 ఓట్లు వచ్చాయి. పదివేల 463 ఓట్ల మెజార్టీతో బిజెపి అభ్యర్థి సోలంకి విజయం సాధించారు. ఈ నియోజకవర్గలో 15. మంది అభ్యర్థులు పోటీపడ్డారు అప్ అభ్యర్థి భరత్ కు 5,294 ఓట్లు మరో స్వతంత్ర అభ్యర్థికి 19,186 ఓట్లు వచ్చాయి. నోటాకు 2,829 ఓట్లు పడ్డాయి. ఓట్ల కోసం అభ్యర్థి వాగులో దూకిన సానుభూతి వర్కౌట్ కాలేదు పాపం.
(