‘యాత్ర’ పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర !

జనవరి 26 నుంచి..

(J. Surender Kumar)

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో.పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు పీసీసీ ఆదివారం పోస్టర్ విడుదల చేసింది. జనవరి 26వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకూ పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి యాత్రను ప్రారంభించనున్నారు.

జోడోకు కొనసాగింపుగా…
ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులు ఈ యాత్రను చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు పీసీసీ సమావేశమై పాదయాత్రపై దిశానిర్దేశం చేశారు.