చడి చప్పుడు కాకుండా తరలించారు!
దట్ ఈస్ పోలీసింగ్..
J. Surender Kumar
హైదరాబాదులో నేడు జరగనున్న సర్పంచుల ధర్నాకు మద్దతు ఇవ్వడానికి వెళ్లయయత్నం లో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం, ధర్మపురిలో ఆయన వెంట ఉంటూ అదుపులోకి తీసుకొని చడి చప్పుడు కాకుండా జగిత్యాలకు తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
తెల్లవారుజామున జీవన్ రెడ్డి, శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ధర్మపురికి వచ్చారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయాలు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, తదితర ఆలయాలను ఆయన దర్శించుకున్నరు. జీవన్ రెడ్డిని CI లు కోటేశ్వర్, కిషోర్, ఎస్సై కిరణ్, పోలీసులు అనుసరిస్తూ తరితగతిన దర్శనం చేయించడానికి రద్దీగా ఉన్న భక్తజనంను పక్కకు జరిపించారు.

చాలామంది భక్తులు, కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ మేరకు ఎమ్మెల్సీ వెంట ఉన్నారు అని అనుకున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపలికి జీవన్ రెడ్డి రాగానే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తజనంను గమనించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి అధికారులు పరస్పరం చర్చించుకున్నారు. జీవన్ రెడ్డి టిఫిన్ చేయడానికి, కాంగ్రెస్ నాయకుల వెంట రాగ, స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంకు వెళ్లారు. అక్కడికి పోలీస్ వచ్చారు. టిఫిన్ చేసి పేపర్ చదువుతూ జీవన్ రెడ్డి కాలయాపన చేశారు.

సీఐలు కిషోర్, కోటేశ్వర్, జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చి సార్ మిమ్మల్ని అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్ట్ చేస్తామన్నారు. పోలీసు అధికారులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాదించారు. సార్ పరిస్థితి అర్థం చేసుకోండి ,మేము పబ్లిక్ సర్వెంట్స్ మాకు సహకరించండి. అంటూ రిక్వెస్ట్ చేశారు. మీరు పబ్లిక్ సర్వెంట్ లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా పబ్లిక్ సర్వెంట్లే అంటూ మీపై ఏసీబీ కేసులవుతాయి, మాపై కూడా ఏసీబీ కేసులు అవుతాయి. విధి నిర్వహణ మీకు ఎంత ముఖ్యమో ? స్థానిక ప్రజా ప్రతినిధుల ఆందోళనకు మద్దతు పలకడం మాకు అంతే ముఖ్యం అన్నారు. దాదాపు పది నిమిషాలు పోలీసులతో వాదించారు.. మాకు ఆదేశాలున్నాయి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో తీసుకుంటామంటూ అని పోలీసులు అన్నారు. సరే నా వాహనంలో వస్తా అంటూ జీవన్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో కాంగ్రెస్ నాయకుడు వాహనంలో కూర్చున్నారు, మీతో మా ఎస్ఐ సైతం మీ వెంట ఉంటారంటూ సిఐ కిషోర్ అనడంతో, నా వాహనంలో మీరే ఎలా కూర్చుంటారు, మీ వాహనంలో మీరు రండి, అంటూ కూర్చున్న వాహనం నుంచి SI ని దించారు.
సిఐ ఎస్సై పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వు వారి వాహనంలోనే ఉండి రావాలని ఆదేశించారు. సీఐ డోర్ లాగడం, జీవన్ రెడ్డి డోర్లు వేయడం, డోర్ లాక్ చేసుకోవడం కొన్ని నిమిషాల పాటు జరిగింది. చివరకు జీవన్ రెడ్డి వాహనంలో ఎస్సై కూర్చుని గంపలవాడా, తెలుగువాడ, గుండా మూడు పోలీస్ వాహనాలు ఎస్కార్ట్ తో జగిత్యాలకు తరలించారు. ఆలయం ముందు అదుపులో తీసుకుంటే కాంగ్రెస్ శ్రేణులు,పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేసే పరిస్థితి ఉండే. జీవన్ రెడ్డిని అదుపులో తీసుకున్న సమాచారం తెలియగానే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు. జువ్వడి కృష్ణారావు వాహన శ్రేణి వెంట జగిత్యాలకు తరలివెళ్లి జీవన్ రెడ్డి ఇంట్లో కలసి సంఘీభావం తెలిపారు
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను పలువురు దటీజ్ పోలీసింగ్ అంటూ ప్రశంసించారు.