26న బాసర ఆలయంలో ఆర్జిత సేవలు బంద్ !

వసంత పంచమి నేపథ్యంలో..

J. Surender Kumar

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈనెల26న వసంత పంచమి పర్వదిన నేపథ్యంలో అమ్మవారికి ఆర్జిత సేవలు నిర్వహించబడవని ఆలయ అధికారులు తెలిపారు.
26న రాత్రి 2 గంటలకు ప్రాతః కాలం లో అమ్మవారికి దేవస్థానం పక్షాన లోకకళ్యాణార్థం అభిషేకం నిర్వహించబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7- 8 గంటల మధ్యన,. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ పక్షాన అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించ నున్నారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం ప్రాతః కాలం 3 గంటల నుండి. సాయంత్రం 6:30 వరకు. కొనసాగుతాయని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, మంచినీరు, పాలు, పండ్లు అందించనున్నట్టు ప్రకటనలో వివరించారు.


భక్తుల వాహనాలను ఉచిత పార్కింగ్ కోసం అన్నదాన బిల్డింగ్ పక్కన, హరిహర కాటేజ్ పక్కన, శ్రీరామ లాడ్జి ఎదురుగా ఖాళీ స్థలం కేటాయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.