ఏసీడీ ఛార్జీల కు నిరసనగా ఈనెల 31 న ధర్నా విజయవంతం చేయాలి!

రైతులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలి !

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J. Surender Kumar,

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆదివారం పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తన అసమర్థతను, వైఫల్యానికి కప్పి పుచుకునెందుకు నిరుపేదలపై ఏసీడీ చార్జీల పేరిట భారం మోపడాన్ని నిరసిస్తూ ఈనెల 31న జగిత్యాలలో విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టనున్నమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న విద్యుత్ పంపిణీ సంస్థలను గట్టెక్కించేందుకు ఎసిడి చార్జీలు తెరపైకి తీసుకువచ్చి నిరుపేదలపై భారం మోపూతున్నారని విమర్శించారు.
గతంలో 500 యూనిట్లకు పైగా వినియోగించిన వారి నుండి మాత్రమే ఏ సి డి చార్జీలు వసూలు చేసేవారు.
నష్టాలు పుడ్చుకునెందుకు ప్రస్తుతం 300 కన్నా తక్కువ యూనిట్లు ఉపయోగించుకునే దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలపై సైతం ఎసిడి చార్జీలు విధించడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉండగా ఎ సి డి చార్జీలు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల నుండి మాత్రమే వసూలు చేస్తుండడాన్ని జీవన్ రెడ్డి తప్పుబట్టారు.
ఉత్తర తెలంగాణ వినియోగదారులు తెలంగాణ బిడ్డలు కారా..తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొనలేదా.. ఎందుకు వివక్ష అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని వినియోగించుకొలేక కెసిఆర్ ప్రజలపై భారం మోపుతోంది
శాసన సభ లో పూర్తిమెజారిటీ ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల హక్కులు పరిరక్షించలేని సీఎం ఇంకెప్పుడు పరిరక్షిస్తారని నిలదీశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు విద్యుత్ వాటా అధిక శాతం కేటాయించారు.
ఎన్ టి పి సి ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి 90% వినియోగించుకునేలా అవకాశం కల్పించారు.
ఇప్పటివరకు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం మాత్రమే మౌలిక వసతులు కేటాయించారని, సీఎం కేసీఆర్ చొరవ చూపకపోవడంతో తెలంగాణ ప్రజలు మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ పొందలేకపోతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో వినియోగించుకునే 40% విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బొగ్గు ఉన్న చోటనే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ, యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని అన్నారు.
రామగుండం, కొత్తగూడెంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.
రామగుండం బి-పవర్ ప్రాజెక్టు స్థానంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ జీవన్ రెడ్డి చేశారు.
రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారా…
తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా సరఫరా చేస్తున్నారా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ నిర్ణీత వేళలు సరఫరా చేశామని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొంది.
యాదాద్రి నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ రాష్ట్రానికి గుదిబండగా మారనుంది.
యాదాద్రి ప్లాంట్ తో రాష్ట్ర ప్రజలపై రు.40,000 కోట్ల భారం మోపారని ద్వజమెత్తారు.
ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు 300 యూనిట్ల కన్న తక్కువ వినియోగించుకున్న వారిపై ఏ సి డి చార్జీలు విధిస్తున్నారన్నారు.
చరిత్రలో ఔరంగాజేబు జుట్టు పన్ను విధించారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ సామాన్యులపై ఎసిడి చార్జీలు విధిస్తున్నారని ఇది కేసీఆర్ పన్ను అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే నెపంతో సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల హక్కులను కాలరస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో 110 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల హక్కులను పరిరక్షించలేనప్పుడు ఇంకెప్పుడు రక్షిస్తారని సీఎం కెసిఆర్ ను నిలదీశారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమార్, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగీ నందయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, పిసిసి మైనారిటీ కార్యదర్శి మోయిజొద్దిన్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, బీర్పుర్ మండల అధ్యక్షుడు, ఎంపీపీ మసర్తి రమేష్, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, పట్టణ అధ్యక్షుడు నేహాల్,
మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్, రమేష్ రావు,పుప్పాల అశోక్, రాధా కిషన్, మున్న, వర్తక సంఘం అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్, బింగి రవి, నక్క జీవన్,శేఖర్, తాజోద్దిన్ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు తోపారపు రజనీకాంత్, బషీర్ పాల్గొన్నారు.