ఆలయాల్లో భక్తుల భద్రత చర్యలేవి..
రాపిడి యాక్షన్ ఫోర్స్ కవాతు ఎందుకో ?

(J. Surender Kumar)

ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలలోని ప్రముఖ ఆలయల లో భక్తుల కోసం ముందస్తుగా చేపట్టిన భద్రతా చర్యలు ఆగుపించడం లేదు. . గత రెండు రోజులుగా  రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు జగిత్యాల జిల్లాలో, మల్యాల, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల లో సమావేశాలు. నిర్వహించి ఆయుధాలతో పట్టణాలలో కవాతు  నిర్వహించారు. జాతీయ నిఘా సంస్థలు,  ఉత్తర తెలంగాణ జిల్లాలలో  ఉగ్రవాద కార్యకలాపాలు కట్టడికి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే . వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ,  గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి లాంటి ప్రముఖ ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలు కోరుట్ల సాయిబాబా ఆలయం, అష్టలక్ష్మి ఆలయం, రాయికల్ మండలంలో అయ్యప్ప స్వామి ఆలయం ఈ జిల్లాలోనే ఉన్నాయి. నిత్యం వేలాదిమంది  భక్తజనంతో రద్దీగా ఉంటుంది.

స్వచ్ఛంద సంస్థల ముసుగులో  నిషేధిత పిఎఫ్ఐ సంస్థ నిజామాబాద్ కేంద్రంగా శిక్షణ ఇస్తూ  యువతను, ఉగ్రవాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తుందని  నేషనల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ( NIA) చార్జిషీట్లో  పేర్కొన్న విషయం తెలిసిందే. 

గత నెల డిసెంబర్ 28 న NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) నిషేధిత పి ఎఫ్ ఐ సంస్థ దేశంలో యువతను ఉగ్రవాద కార్యక్రమాల వైపు ప్రేరేపిస్తుందంటూ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొన్నారు. NIA రిమాండ్ కు తరలించిన 12 మందిలో పదిమంది ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారు కావడం. ప్రస్తావనారం. దీంతోపాటు నిజాంబాద్ లో దాదాపు 200 మందికి పైగా యువత శిక్షణ పొందారంటూ NIA అధికారులు ప్రసార మాధ్యమాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఎందుకో కవాతు ?

ఇదిలా ఉండగా పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంలో పోలీసులు ఆయుధాల ప్రదర్శన, కవాతులు, విద్యార్థులకు చూపించడం, వివరించడం పరిపాటి. అయితే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు బెటాలియన్ ఉన్నతాధికారులు, ఎన్నికల సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు అంటూ భరోసా కలిపిస్తూ కవాతు నిర్వహించడం తెలిసిందే

. గత వారం రోజులుగా జిల్లాలో ఇలాంటి కవాతు నిర్వహించడం చర్చకు అవకాశం కల్పిస్తున్నది.  ప్రధాన కుడళ్ళు , ఆలయాలు, ప్రార్థన మందిరాలు, బస్టాండ్లు , విద్యాసంస్థలు వివరాలు వాటి మధ్య దూరం మైదానం ప్రాంతం నుంచి వీటి దూరం వివరాలను రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధికారులు రికార్డు చేసుకున్నట్టు సమాచారం.

కానరాని భద్రతా చర్యలు!

కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న ప్రముఖ ఆలయాలు కొండగట్టు, బాసర, ధర్మపురి, వేములవాడ, గూడెం, ఇలాంటి అనేక నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని ప్రవేశ ద్వారాల వద్ద డోర్ మెటల్ డిక్టేటర్లు అగుపించావు, 

తనిఖీలు చేపట్టాల్సిన హ్యాండ్ మెటల్ డిక్టేటర్లు ఉండవు, అత్యధిక శాతం సీసీ కెమెరాలు పనిచేయవు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను,  హ్యాండ్ బ్యాగులను ఎలా తనిఖీలు చేస్తారో?  అనుమానాస్పద వ్యక్తులను ఎలా గుర్తిస్తారో ?  కొలువైన ఉన్న ఆ దేవుడికే తెలియాలి!   ఆలయ  ప్రాంగణాల్లో, జన సమర్థం గల ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికను పర్యవేక్షిస్తూ ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలి. పోలీస్ శాఖ ద్వారా శిక్షణ పొందిన ఇద్దరు నిష్ణాతులైన సెక్యూరిటీ గార్డులను ఆయా ఆలయాలలో ఉండాలి. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు, మెటల్ డిటెక్టర్ ద్వారా ప్రవేశాలు,. హ్యాండ్ మెటల్ డిక్టేటర్ తనిఖీ దృశ్యాలను ఆలయ అధికారులు భద్రపరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలో ఐఎస్ఐ తీవ్రవాది, హజంఘోరి ఎన్కౌంటర్ తర్వాత, నిఘా వర్గాల సూచనల మేరకు దేవదాయ శాఖ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు 2007, సెప్టెంబర్ 12న, లేక సంఖ్య  జే 2/968/06 ద్వారా భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా  ద్వారాల వద్ద మెటల్ డిక్టేటర్ లు, హ్యాండ్ డిక్టేటర్ లు, అదనంగా, ప్రత్యేకంగా, సీ. సీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

అనేక ఆలయాల్లో సెల్ ఫోన్లు భద్రపరిచే లాకర్లు గాని ఉద్యోగి గాని లేకపోవడం విశేషం.
కలెక్టర్ జోక్యం చేసుకొని ధర్మపురి, కొండగట్టు ఆలయాల్లో భద్రతా చర్యలకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా భక్తజనం కోరుతున్నారు.