ఆలయాల ఆదాయానికి అడ్డగోలుగా గండి!

సామాగ్రి కొనుగోలు ధరలు పరమాత్ముడికే తెలియాలి

అన్ని ఆలయాలకు  ఒక్కరే సప్లయర్.!

(J.Surender Kumar)

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆదాయానికి అడ్డగోలుగా గండి పడుతున్నది. ఆయా ఆలయాలలో  ప్రసాదాలు తయారీకి కొనుగోలు చేస్తున్న సామాగ్రిల ధరలు సాక్షాత్ ఆ పరమాత్ముడికి తెలియాలి తప్ప, ఇతరులకు తెలిసే అవకాశం లేదు. దేవాదాయ శాఖ ప్రకటిస్తున్న టెండర్ ల లోని  నిబంధనలు టెండర్  వ్యాపారు లను టెన్షన్ లకు గురిచేస్తున్నాయి.  రాష్ట్రంలో  ప్రముఖ ఆలయాలకు సామాగ్రిని సరఫరా చేస్తున్నది ఒకే సంస్థ (ఒక్కడే) కావడంతో కొందరు అధికారులు అందినంత కమిషన్ లు   దండుకుంటూ ఆలయాల ఆదాయానికి గండి కొడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.  గత కొన్ని సంవత్సరాలుగా  ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇరువది ఆలయాలకు పైనే…..

కొండగట్టు, ధర్మపురి రెండు ఆలయాల్లోనే ప్రసాదాల తయారీ సామాగ్రినీ అధికారులు అధిక ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలతో జగిత్యాల కలెక్టర్ కు సామాజిక కార్యకర్త ఆకునూరి సురేష్, కొందరు భక్తులు ఈనెల 2న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై  కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
విశ్వసినీ వర్గాల సమాచారం మేరకు  కొండగట్టు, ధర్మపురి ఆలయాలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ  ఆలయాలైన యాదగిరి,  వేములవాడ, బాసర, భద్రకాళి, కురివి, భద్రాచలం, సమ్మక్క సారలమ్మ, బల్కంపల్లి ఎల్లమ్మ, పాల్వంచ, కొత్తకొండ, కాలేశ్వరం, ఓదెల, ఏడుపాయల, బొంతుపల్లి, శ్రీనగర్ కాలనీ చిక్కడపల్లి, సికింద్రాబాద్ గణేష్ మందిర్, గూడెం,  కొమురవెల్లి తదితర ఆలయాలలో ప్రసాద కోసం కొనుగోలు చేసే సామాగ్రికి సైతం అధికారులు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు  ఆరోపణలు ఉన్నాయి.

మార్కెట్లో  తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది.!

మాల్స్ వ్యాపారం లోకి కార్పొరేట్ దిగ్గజాలు అడుగు పెట్టడంతో  డిమార్ట్,  వాల్ మార్ట్,  సెన్సెస్,  మెట్రో,  రిలయన్స్ తదితర హోల్ సేల్  దుకాణాలు సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చాయి.  ప్రసాదాల సామాగ్రి తయారీకి అవసరమైన సామాగ్రి అంత   ఈ మార్కెట్లలో అతి తక్కువ ధరలకు  అందుబాటులో ఉన్నాయి.

ఆన్ లైన్ టెండర్  (ఈ ప్రొక్యూర్మెంట్) పేరిట  హైదరాబాద్ సంస్థ నుంచే అన్ని ఆలయాలకు సప్లై!

నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది కిరాణా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు చిన్న ,చితక ,. కిరాణా, హోల్సేల్ దుకాణదారులు  ఆన్ లైన్ టెండర్ లో నిబంధనల చూసి టెన్షన్ పడాల్సిందే తప్ప,  టెండర్ లో పాల్గొనే అవకాశలు ,వీరితోపాటు జిల్లాలలో ఏ ఒక్క వ్యాపారికి  అర్హతలు లేకుండా  టెండర్ నిబంధనలను దేవాదాయ శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులతో ఓ వ్యాపార సంస్థ చేసుకున్న అనధికార రహస్య ఒప్పందం మేరకు ఈ నిబంధనలతో రూపకల్పన చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. 

సామాగ్రి కొనుగోలు టెండర్ ప్రకటన జారీకి కొందరు ఆలయ అధికారులను మచ్చిక చేసుకొని ఈ తత్తంగం నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సర కాలానికి గాను ఏప్రిల్ ఒకటి నుంచి మార్చ్ 31 వరకు, సంవత్సర కాలానికి  టెండర్ పొందిన వారు ఆయా ఆలయాలకు సరుకులు సరఫరా చేయవలసి ఉంటుంది.

ప్రభుత్వ రంగంలో..

రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వ విద్యాసంస్థలు మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గురుకుల పాఠశాలు, ఆశ్రమ ఏకలవ్య, మోడల్ స్కూల్స్, కస్తూరిబా స్కూల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో లక్షలాదిమంది విద్యార్థులకు భోజన సౌకర్యాలు కల్పన కోసం సరఫరా  సామాగ్రి టెండర్లకు. లేని ప్రత్యేక నిబంధనలు ఆలయ టెండర్లకు ఉండడం విశేషం!

వ్యాపారస్తులను టెన్షన్ కు  గురిచేస్తున్న టెండర్ నిబంధనలు కొన్ని!

టెండర్ దారుడు, ఫుడ్ గ్రేన్ వ్యాపారంలో రిజిస్టర్ అయి ఉండాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి!

EMD, డబ్బులు. ₹ 15 లక్షల రూపాయలు ఆయా ఆలయ కార్యనిర్వహణాధికారి పేరిట నేషనల్ బ్యాంకులో డిడి తీయాలి. టెండర్ పొందినవారు సంవత్సర కాల పరిమితి ముగిసిన తరువాత EMD డబ్బులు తిరిగి పొందడానికి అవకాశం!
టెండర్ షెడ్యూల్ ఫామ్ ధర  ₹ 3000/-
బియ్యం, పంచదార, శనగపప్పు, ఖజు ,ఎండు ఖర్జూర, నూనెల తదితర వ్యాపారంలో సాలిన కనీసం ₹ 10 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు కలిగి ఉండాలి!
గ్రేడ్ వన్ ఆలయాలనికి సాలీనా ₹ 5 కోట్లు, వ్యాపార లావాదేవీలు కలిగిన వారు అర్హులు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ,నుంచి డిప్యూటీ కమిషనర్  హోదా గల ఆలయాలకు ₹ 10 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉండాలి. రీజినల్ జాయింట్ కమిషనర్ హోదా గల ఆలయాలకు ₹ 25 కోట్ల వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నవారే ఆయా ఆలయాల్లో టెండర్లు పాల్గొనడానికి అర్హతగా ప్రకటించారు.
₹ 5.  ₹10,  ₹ 25  కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రతి ఆర్థిక మూడు సంవత్సరములకు వాణిజ్య పనుల శాఖ జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని ( సర్టిఫికెట్ ) జతపరిచాల్సి ఉంటుంది. ఈ ధ్రువీకరణ జతపత్యాల్సి ఉంటుంది .
మూడు సంవత్సరల కాల అనుభవం,  సరఫరా సక్రమంగా చేస్తున్నాడంటూ ప్రభుత్వ సంస్థలచే ధ్రువీకరణ పత్రం తప్పనిసరి  సమర్పించాల్సి ఉంటుంది.
సంస్థ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇన్కమ్ టాక్స్ కాపీ, వ్యాపారంలో లాభనష్టాల ఆడిట్ నివేదిక,. మూడు ఆర్థిక సంవత్సర అమ్మకాలు, వ్యాపార లావాదేవీల,  వివరాలు దానిపై కమర్షియల్ టాక్స్ అధికారి అట్టేస్టేషన్  చేయించి జతపరిచాల్సి ఉంటుంది.
ఆగా మార్క్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫుడ్ గ్రేన్ వ్యాపారం బియ్యం,పప్పులు, హోల్సేల్ ఖజు, పల్లి గింజలు, ఆయిల్ గింజలు, FSSAI లైసెన్స్ సమర్పించాలి.
200 మెట్రిక్ టన్నుల, బియ్యం 100 మెట్రిక్ టన్నుల, శనగపప్పు  6 మెట్రిక్ టన్నుల ఖాజూ (రెండు పలుకులు గలది).20 మెసేజ్ ఎండుఖర్జూర పండ్లు, పలుకులు (రెండు పలుకులు కలిగి ఉన్నది) 2 మెట్రిక్ టన్నుల చింతపండు, 150. మెట్రిక్ టన్నుల పంచదార, 6 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూర, గత రెండు ఆర్థిక సంవత్సరాలలో సరఫరా చేసినట్టు చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరించిన పత్రం జతపరిచాల్సి ఉంటుంది.

ఆలయాలకు సరఫరా చేసే సామాగ్రి టెండర్ లో అర్హతలు నిబంధనలు (స్టాక్) తదితర నిబంధనల మేరకు రాష్ట్రంలోని  33 జిల్లాకు. చెందిన ఏ ఒక్క వ్యాపారి గాని,వ్యాపార సంస్థ గాని  టెండర్లు పాల్గొనలేదని సమాచారం. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ తన మరో రెండు బినామీ సంస్థలతో ఆన్ లైన్ టెండర్ లో పాల్గొని కైవసం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా  ఆలయాలకు  సరఫరా అవుతున్న సామాగ్రి ధరలు, మార్కెట్లో ధరలు, సంబంధిత ఆలయాల కార్యనిర్వాహణాధికారులకు, సరఫరా చేసే సంస్థకు మాత్రమే తెలుసని ధర్మకర్తలకు, ఉద్యోగులకు తెలిసే అవకాశం లేకుండా  కొనసాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.