సర్కులర్ తోనే సరుకులు కొనుగోలు..
కొనుగోలుకు ప్రత్యేక జీవో లేదా ?
రాష్ట్రం ఏర్పడిన 46 రోజులకే సర్కులర్ జారీ!
ఉమ్మడి రాష్ట్ర నివేదికలు అడ్డుపెట్టుకొని…
J. Surender Kumar,
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల ఆదాయం కొందరు అధికారుల పాలిట నైవేద్యంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆలయాల కోసం సరుకుల కొనుగోలుకు ప్రత్యేక జీవో లేకున్నా, ఉమ్మడి రాష్ట్రంలో అధికారుల నివేదికల ఆధారంగా జారీ అయినా సర్కులర్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు, రాష్ట్రం ఏర్పడిన 46 రోజులలో దేవదాయ శాఖ జారీ చేసిన సర్కులర్ ద్వారా సంవత్సరాల తరబడిగా ఆన్లైన్ టెండర్ నిబంధనలు అడ్డుపెట్టుకొని సరుకులకు అడ్డగోలుగా అధిక ధరలు చెల్లిస్తూ కొందరు అధికారులు కొనుగోలు చేస్తూ, ఆలయాల ఆదాయంకు గండి కొడుతున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటైన 46 రోజులకే సర్కులర్!
దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఏర్పడిన 46 రోజులకే సరుకుల కొనుగోలు విధి విధానాలపై 2014, జులై 18 న, సర్కులర్ నెంబర్ అర్, సి.No. E 2/10825/2014. జారీ చేశారు.

విజిలెన్స్ నివేదికల ఆధారంగా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక No.11(C.No.1104/ V&E/D4/10). తేదీ 30-1-2013 నాటి నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ లేఖ సంఖ్య. ఆర్.సి.No,A4/37487/2013, తేదీ 31-12-2 013న జారీ చేసిన నియమ నిబంధనలో మేరకు సరుకులు కొనుగోలు చేయాలని ఆలయాల కార్య నిర్వహణాధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.

వ్యాపారులకు షాక్ ఇస్తున్న నిబంధనలు!
ప్రముఖ పట్టణాలలో, జిల్లా కేంద్రాల్లో, కిరాణం హోల్ సేల్ వ్యాపారస్తులకు టెండర్ లోని బంధనలు షాక్ ఇస్తున్నట్టు సమాచారం. ఆ నిబంధనలు హైదరాబాదులోని రెండు, మూడు వ్యాపార సంస్థలకు ఉన్నట్టుగా, గత కొన్ని సంవత్సరాలుగా వారే టెండర్ లో పాల్గొంటూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు సరుకులు సప్లై చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.

ఆర్థిక సంవత్సర కాలం కు సరుకుల సప్లై కి ఒక్కటే టెండర్ !
ఆలయాలలో స్వామివారికి నిత్య నివేదన, ప్రసాదాల తయారీ, అన్నదానం, పూజాది కార్యక్రమాల పూజా సామాగ్రి, పారిశుద్ధ్య నిర్వహణ కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్ లాంటివి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసే ఆకు దొప్పలు, విస్తరి ఆకులు, స్వామివారికి మామిడి తోరణాలు కట్టే సుత్తిలి దారం, మొదలుకొని విద్యుత్తు వైర్లు, బల్బులు, పరికరాలు, సప్లై కోసం టెండర్ లలో అధికారులు ఆలయాల అవసరాల మేరకు సప్లై లో దాదాపు 100 అంశాల వివరాలు పేర్కొంటున్నారు అని సమాచారం.
సంవత్సర కాలానికి సరుకులు సప్లై చేసే టెండర్ సొంతం చేసుకున్న వ్యాపారుడి , వ్యాపార సంస్థ పేరు, ఒప్పందం జరిగిన సరుకుల ధరలు, సరుకుల నమూనా ( శాంపిల్స్) సమాచారం (సంవత్సర కాలం పాటు టెండర్ ఒప్పందం మేరకు పేర్కొన్న నాణ్యత ప్రమాణాలు. గల సరుకుల సప్లై చేస్తానంటూ.

టెండర్ పొందిన వ్యాపారి, ఆలయంలో తనిఖీల కోసం. ఇచ్చే నిలువ ప్యాకెట్లు) ఆలయాల పాలకవర్గానికి గాని, అర్చకులకు, (పాలకవర్గం లేని చోటు) ఉద్యోగులకు వాటి సమాచార వివరాలు తెలియకుండానే ఆలయ అధికారుల సరుకుల కొనుగోలు తతంగం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
(నాణ్యత ప్రమాణాలు, లేని నాసిరకం సరుకుల, సప్లై తీరు తెన్నులు, నిబంధనలకు తిలోదకాల వివరాలు త్వరలో).