కలెక్టర్ కు మహిళా కమిషనర్ లేఖ !
(J.Surender Kumar)
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం (ఐసిడిఎస్) పరిధిలో కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు, బూతు లెవెల్ అధికారుల (BLO) విధుల నిర్వహణ నుంచి మినహాయింపు ఇవ్వండి అంటూ మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారిని డీ. దివ్య జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ. రవికి లేఖ వ్రాశారు.

ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకు పౌష్టికాహారము, గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అందించడం, పిల్లల బరువుల, ఎత్తుల, వివరాలు నమోదు చేయడం ,పిల్లలకు వ్యాక్సినేషన్ గూర్చి తల్లులకు వివరించడం, పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి వారిని చైతన్యవంతులు చేయడం, కిషోర్ బాలికల ఆరోగ్య స్థితిగతులు, శ్యామ్, మామ్ పిల్లల ఆరోగ్య స్థితిగతులపై వైద్యం కోసం సిఫారసులు, తదితర మహిళా శిశు సంక్షేమ పథకాలు అమలులో క్రియాశీల పాత్ర అంగన్వాడీ దే అని లేఖలో పేర్కొన్నారు.

ఉదయం 9 గంటల, నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడి కేంద్రాలు కొనసాగుతాయని, బిఎల్ఓ విధుల నిర్వహణతో విజయవంతంగా అంగన్వాడి పథకాల అమలులో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కమిషనర్ లేఖ లో పేర్కొన్నారు. ఇతర శాఖ నుంచి ఉద్యోగులను, సిబ్బందినీ, బిఎల్ఓ విధులు కేటాయించి, అంగన్వాడి కార్యకర్తలకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా. D.O LrNo.459/ICDS/2018, 2022, డిసెంబర్ 28న డి వో లెటర్ ద్వారా ఆమె కోరారు.