సోమవారం ధర్మపురి ఐ. సి.డి.యస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో లో పోషన్ అభియాన్ లో భాగంగా ILA (అభివృద్ది అభ్యాస విధానాలు) 11,12, మాడ్యూల్స్ పైన ట్రైనింగ్ బీర్పూర్, మరియు సారంగపూర్ మండలంలోని అంగన్వాడీ టీచర్ల కు నిర్వహించడం జరిగినది .
ఇందులో భాగంగా CDPO సంపద కుమారి మాట్లాడుతూ బలహీన నవజాత శిశువు ను ఎలా గుర్తించాలి, అదనపు ఆహారం ఏ వయస్సు , ఎలా మరియు ఎందుకు మొదలు పెట్టాలి గురించి మరియు తల్లులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి అని చెప్పడం జరిగినది. ఇందులో భాగంగా సూపర్ వైజర్స్ కుసుమ, ఆండాలు, శైలజ, లత , నీలిమ, అంగన్వాడీ టీచర్లు మరియు పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ ప్రణిత తదితరులు పాల్గొన్నారు