అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు!

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!

(J.Surender Kumar)

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్,రూరల్ మండలాలకు చెందిన 28 మంది కి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 28 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్., జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ అందించారు


ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
తల్లి గర్భం నుండి మొదలు పెడితే ఆడ పిల్ల పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లే వరకు ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు.
మాతాశిశు రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు.
దేశంలో పలు రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి అని అన్నారు..
ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని చెప్పారు.


ఆశా, అంగన్ వాడి లకు జీతాలు పెంచి ప్రజల కోసం వారి సేవలు ఉపయోగిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఇతర రాష్ట్రాల కూలీలు నేడు తెలంగాణ లో ఉపాధి పొందుతున్నారు అని గుజరాత్ నుండి సైతం ఇక్కడికి వస్తున్నారు అని అన్నారు.
ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం తర్వాత మగ,అడ పిల్లలు పుడితే 12,13 వేలు ఇస్తూ కేసీఆర్ కిట్ అందిస్తున్నారు.
పేద మధ్య తరగతి ప్రజల పిల్లలకోసం గురుకుల పాఠశాల లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య,సౌకర్యాల కల్పన.
నేడు అన్ని పాటశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం అయింది అని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ డిగ్రీ,పీజీ విద్యార్థుల కోసం కళాశాలకు ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది అని అన్నారు.
ఆడబిడ్డల కోసం ఆరోగ్య లక్ష్మి, షీ టీమ్స్,బతుకమ్మ చీర,ఆరోగ్య కిట్లు,డబల్ బెడ్ రూం ఇండ్లు,బీడీ పెన్షన్ అందజేస్తున్నము అని అన్నారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని,చట్ట బద్దం గా వివాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు…

జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ

అన్ని వర్గాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి,సంక్షేమం కోసం ఎమ్మేల్యే డా సంజయ్ గారు నిరంతర కృషి చేస్తున్నారు.
పేదవారి ఇంట్లో పెద్ద కొడుకు కెసిఆర్ గారు మారారని అన్నారు.
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని,నాయకులను మరవకుండా ఉండి ప్రభుత్వానికి అండగా ఉండడం ప్రజల భాధ్యత అని అన్నారు ..