నాణ్యత ప్రమాణాలు లేని సరుకులు వాడారు!
శబరిమలై దేవస్థానం బోర్డు కు హైకోర్టు ఆదేశం!
6 లక్షల డబ్బాల అరవన్న పాయసం సీజ్!
( J. Surender Kumar)
శబరిమల అయ్యప్పన్ ఆలయంలో ప్రస్తుతం నిల్వ ఉన్న దాదాపు 6 లక్షల అరవనిపాయసం భక్తులకు పంపిణీ చేయరాదని కేరళ హైకోర్టు శబరిమలై దేవస్థానం బోర్డును ఆదేశించింది. దీంతో6 లక్షల అరవన్న పాయసం డబ్బాలను సీజ్ చేశారు. మంగళ, బుధవారాల్లో అయ్యప్ప భక్తులకు అరవన్నపాయస డబ్బాలు దొరకక అవస్థలు పడ్డారు.
శబరిమల ఆలయంలో రవన్న పాయసం అయ్యప్పన్ కోసం ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేస్తారు. ప్రస్తుతం మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తజనం సన్నిధానం కు తరలి వస్తుంటారు. ఈ పాయసం డబ్బాలను స్వామివారి ప్రసాదంగా కొనుగోలు చేస్తారు, ఈ ప్రసాదాలు సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటాయి. దేవస్థానం బోర్డు స్వామి వారి ప్రసాదంగా ఉచితంగా కూడా పంపిణీ చేస్తారు.
నాణ్యత ప్రమాణాలు లేని సరుకులతో చేశారు!
నాసిరకం యాలకులు వాడారు!

తాజాగా ఓ వివాదం నెలకొంది. అంటే ఈ పాయసంలో వాడే యాలకులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణను యాలకుల వ్యాపారి బహిర్గతం చేశాడు. కొన్ని నెలల క్రితం శబరిమల దేవస్థానం అరవనపాయసం తయారీలో ఈ యాలకుల కోసం టెండర్ ప్రకటన జారీ చేశారు. వేలం ద్వారానే యాలకులు కొనుగోలు చేశారు. ఈ వేలంలో. టెండర్ దక్కని మరో వ్యాపార సంస్థ ‘అయ్యప్ప స్పేస్ ఏజెన్సీ’ అరవన్నపాయస తయారీలో నాసిరకం యాలకులు వినియోగిస్తున్నారు అనే ఆరోపణలతో కేరళ హైకోర్టులో కేసు వేశారు.
పాయసంలో ఉపయోగించే యాలకుల నాణ్యత ప్రమాణాలు పరీక్షించాలని కోర్టు ఆదేశించింది. తిరువనంతపురంలోని ,’ఫుడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ అరవనపాయసం పరీక్షించారు. నివేదికలో షాకింగ్ సమాచారం వెల్లడైంది. అరవనిపాయసంలో వాడే యాలకులలో అనుమతించిన దానికంటే ఎక్కువ మోతాదులో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టు నివేదికలో వెళ్లడైంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన న్యాయస్థానం ‘ మీరు భక్తులకు కలుషిత పూరిత మైన ప్రసాదాలుఎలా ఇస్తారని ప్రశ్నించింది.’

దీనిపై దేవసం బోర్డు స్పందిస్తూ.. కొనుగోలు చేసిన యాలకులు సరిపోకపోవడంతో, స్థానిక మార్కెట్ నుంచి మళ్లీ యాలకులను కొనుగోలు చేశామని, అందుకే ఈ సమస్య తలెత్తిందని హైకోర్టుకు తెలిపారు. తాము ఇలాంటి సమాధానాలు అంగీకరించబోమని, అంగీకరించలేమని, భక్తులకు ఇలాంటి ప్రసాదాలు పంపిణీ చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. భక్తుల సంక్షేమం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అన్నారు. దీంతో దేవస్థానం బోర్డు దాదాపు 6 లక్షల టిన్నుల(డబ్బాల) అరవన్న పాయసం నిల్వలు ఉన్నాయని (స్టాక్) బోర్డు కోర్టుకు వివరించారు. నిలువ ఉన్న మొత్తం ప్రసాదాన్ని తక్షణమే సీల్ చేయాలని, మరియు భక్తులకు పంపిణీ చేయకుండా పూర్తిగా ధ్వంసం చేసేలా చూడాలని దేవస్థానం బోర్డు హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో శబరిమల భక్తులకు అరవన్న పాయసం ప్రసాదాల కొరత ఏర్పడింది. నాణ్యత ప్రమాణాలు గల సరుకులతో తాజాగా పాయసం తయారు చేసి ఇవ్వాలని దేవసం బోర్డుకు

తెలిపింది. గురువారం నుంచి యాలకులు లేని పాయసం తయారు చేసి అయ్యప్పలకు పంపిణీ చేస్తున్నామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపాలన్ వార్తా సంస్థలకు వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్గానిక్ యాలకులు వినియోగం కోసం చర్చిస్తామని ఆయన అన్నారు. అయ్యప్ప స్వాములకు తాజాగా తయారు చేస్తున్న అరవన్న పాయసం పంపిణీకి దేవస్థానం బోర్డుఏర్పాట్లు చేస్తున్నది.