కోట్లాది రూపాయలు అప్పుల పేరిట కొల్లగొట్టిన వైనం!
( J. Surender Kumar)
జగిత్యాల పట్టణంలో సామాజిక సంఘ సేవకుడిగా చలామణి అవుతు నమ్మిన వారి దగ్గర అప్పుల తీసుకొని కొట్లాది రూపాయల తో అదృశ్యమైన రేగొండ నరేష్ ఆచూకీ తెలిసినట్టు సమాచారం..
సారంగాపూర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాధితుడు సాయికిరణ్ కొంతకాలం హైదరాబాదులో మాటువేసి శనివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ లాడ్జి పట్టుకున్నట్టు తెలిసింది.
2021 సెప్టెంబర్ లో దాదాపు ._ 30 కోట్ల నగదు తీసుకున్న అప్పులతో అదృశ్యమైన ఆచూకీ కోసం. పోలీస్ యంత్రాంగం విస్తృతంగా గాలించింది. ఎస్పి సింధు శర్మ కొన్ని నెలలపాటు ప్రత్యేక పోలీసు బృందాలతో మహారాష్ట్ర, కర్ణాటక అనుమానిత ప్రాంతాలలో గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. నిరంతరం నరేష్ పై పోలీస్ శాఖ నిఘా పెట్టింది. పట్టణంలోని కొందరు ప్రముఖులు సైతం లక్షలాది రూపాయల బ్లాక్ మనీ అప్పుగా ఇచ్చినట్టు. చర్చ.

నరేష్ ఆచూకీ లభ్యమైనట్లు పోలీస్ వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
