బాసర పుణ్యక్షేత్రం బంద్ విజయవంతం ! హైవేపై రాస్తారోకో !

రేంజర్ల రాజేష్ అరెస్టు కు డిమాండ్ !

J. Surender Kumar

హిందూ దేవత సరస్వతి అమ్మవారి పై నాస్తికుడైన రెంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖపుణ్యక్షేత్రమైన బాసర పట్టణంలో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది.
నాస్తిక సంఘం నాయకుడు రెంజర్ల రాజేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, జ్ఞాన సరస్వతీ దేవాలయం ముందు ప్రజలు వ్యాపారస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అర్చకులు, ఆలయ సిబ్బంది కూడా నిరసనకు దిగారు.

రాజేష్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్‌- భైంసా హైవేపై గ్రామస్తులు, వ్యాపారులు రాస్తారోకో చేపట్టారు. .నిరసనతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రాజేష్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
హిందూ సంస్థలు, భక్తులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.  పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం నమోదుచేసి రాజేష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవుళ్లను, ప్రధానంగా అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గత వారం వికారాబాద్ జిల్లా పోలీసులు నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ ,మరో కార్యకర్త డోలు హనుమంతును అరెస్టు చేశారు.

నరేష్ డిసెంబర్ 19న కొడంగల్‌లో చేసిన వ్యాఖ్యలు, మూడు రోజుల క్రితం ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నరేష్‌ను తక్షణమే అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఆయనపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.
అయ్యప్ప స్వామిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గాను మరో వ్యక్తి బైరి అగ్నితేజ్‌ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 30న ఫేస్‌బుక్‌లో కించపరిచే విధంగా పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. భక్తుల మత, మనోభావాలను దెబ్బతీసినందుకు అరెస్టు చేశారు
.