బధిరుల.. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలి! మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J.Surender Kumar,

దేవుడిచ్చిన మానవజన్మను పరుల సేవకోసం ఉపయోగించినప్పుడే… పుట్టుకకు సార్థకత అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కరీంనగర్ జిల్లా రేకుర్తి లోని బధిర ఆశ్రమ పాఠశాలలో 1981 నుండి 2022 వరకు చదువుకున్న బధిర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగిన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ఆశ్రమ పాఠశాలలో 41 సంవత్సరాలు చదువుకున్న పూర్వ విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు..

అంగవైకల్యం ఉన్నవారు, కళ్ళు లేని వారు, మూగవారు బధిరులు, దివ్యాంగులు కాదని… మనస్సులో ఇతరుల చెడును కోరుకునే వారు నిజమైన బధిరులు, మంత్రి అన్నారు
పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను… ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామి ఇచ్చారు.
బధిరుల పాఠశాలలో ఉన్న వారంతా పేదవారేనని, పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టడం బాధాకరమన్నారు.

వారంతా దైవసమానులన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు, బధిరుల పాఠశాలలో పిల్లలకు కావల్సిన అన్ని సమకూర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బధిర విద్యార్థులకు ఇంటర్ కాలేజీ కావాలని అడిగారని… సిఎం కెసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి… కాలేజీ ఇచ్చే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పేద విద్యార్థులు… బధిరులు… అంగవైకల్యం కలవారికి సేవ చేస్తే… దేవుడు మానవ జన్మనిచ్చినందుకు జీవిత సార్థకతగా భావించుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కేక్ కట్ చేసిన విద్యార్థులకు తినిపించారు