ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి ఈశ్వర్!

J.Surender Kumar,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయఅభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం చింతామణి చెరువు కట్ట వద్ద ప్రతి సంవత్సరం జరుగు పుట్టబంగారం ఉత్సవ కార్యక్రమంలో స్థలములో ₹15 లక్షల SDF నిధులతో, ఆర్చ్ ,సాలారం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. ధాతల ద్వారా దేవస్థానం ఆవరణలో శ్రీ స్వామివారి నిత్య నరసింహ హోమం హోమశాల నిర్మాణం ₹ 12 లక్షల వ్యయంతో చేపడుతున్న నిర్మాణం కు భూమిపూజ చేశారు.

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. పట్టణంలో ,జాతిపిత మహాత్మాగాంధీ నూతన విగ్రహాన్ని మంత్రి ఈశ్వర్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత,. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్,. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ,లు. ఆవిష్కరించారు.

ధర్మపురి లో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి!

ధర్మపురి పట్టణ కేంద్రంలోనీ జూనియర్ కళాశాల మైదానంలో MLA రోలింగ్ క్రికెట్ కప్ పోటీలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ పోటీల్లో 152 జట్లు క్రికెట్ ఆడనున్నాయి. క్రికెట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన జుట్టుకు ₹ 60 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన జుట్టుకు ₹30 వేల రూపాయలు నగదు బహుమతులు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 152 జట్లకు ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా క్రీడాకారులకు టీ షర్ట్ లను మంత్రి అందించారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ రోలింగ్ కప్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు..


ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో గెలుపు ఓటము లకు అతీతంగా ముందుకు సాగాలని మంత్రి అన్నారు. జాతీయ గీతాలాపనతో.పోటీలను ప్రారంభించారు, ప్రారంభమైన మ్యాచ్ లో సిరికొండ, దమ్మన్నపేట గ్రామాల జట్లు పోటీపడ్డాయి.
మంత్రి పాల్గొన్న పలు కార్యక్రమల లో
పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ , జెడ్పీటీసీలు బత్తిని అరుణ , బాదినేని రాజేందర్, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, యంపిపి లు చిట్టి బాబు, సౌల్ల భీమన్న గారు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సునీల్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న ,


దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు గునిశెట్టి రవీందర్, సంగెం సురేష్, అక్కనపల్లి సురేందర్ , వేముల నరేష్ , ఇనగంటి రమ వెంకటేశ్వరరావు , చుక్క రవి, పల్లెర్ల సురేందర్, జైన రాజమౌళి, గందె పద్మ శ్రీనివాస్ , స్థంభంకాడి మహేష్ , గుంపుల రమేష్ , , మున్సిపల్ కౌన్సిలర్స్ , ప్రజాప్రతినిధులు అధికారులు , గ్రామ ప్రజలు , అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.