ధర్మపురి ఆలయంలో డబ్బుల గొడవ !
అధికారులను నిలదీసిన ఉద్యోగి!

J. Surender Kumar,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం తాత్కాలిక వేతనంపై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి కి, ఆలయ అధికారులకు డబ్బుల విషయంలో గొడవ జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి.

ప్లంబర్ గా గత పది సంవత్సరాల కాలం పైగా విధులు నిర్వహిస్తున్న గంగాధర్ అనే ఉద్యోగి తనకు జీతం డబ్బులు సరిపోవడంలేదని, నేను ఉద్యోగం మానివేస్తాను అంటూ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. నీవు లిఖితపూర్వకంగా పత్రం రాసి పోవాలంటే అధికారులు ఉద్యోగిని హెచ్చరించారు. దీంతో ఉద్యోగి నేను పిఎఫ్ కోసం రెండు సంవత్సరాల క్రితం చెల్లించిన దాదాపు 44 వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. నీ పిఎఫ్ డబ్బులు త్వరలో వస్తాయని. వారు వివరించడంతో, ఆన్లైన్లో కానీ, రికార్డులలో నా పేరు అగుపించడం లేదు అనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొందరు తాత్కాలిక ఉద్యోగులకు పదోన్నతులు ఎలా కల్పించారు అంటూ నిలదీశాడు. ఈ దశలో మరో ఇద్దరు అధికారులు, ప్లంబర్ గంగాధర్ ను బుజ్జగించే యత్నం చేశారు. నాతో పాటు అనేకమంది తాత్కాలిక ఉద్యోగులు, స్వీపర్ల వద్ద నుండి కూడా వసూలు చేసిన లక్షలాది రూపాయలు ఏం చేశారంటూ ? గంగాధర్ ప్రశ్నించాడు. త్వరలో చెక్కులు ప్రావిడెంట్ కార్యాలయానికి. పంపించనున్నట్టు అధికారులు మరోసారి ఉద్యోగిని శాంతింప చేయడానికి ప్రయత్నించారు. నేను మీకు ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి చెల్లించాల్సిందే అంటూ ఉద్యోగి డిమాండ్ చేశారు. ఈ గొడవ భక్తులు, పలువురు సిబ్బంది తిలకించారు.
ఇది ఇలా ఉండగా ప్రావిడెంట్ ఫండ్ పేరిట దాదాపు 30 మంది తాత్కాలిక ఉద్యోగుల దగ్గర తీసుకున్న డబ్బలు లక్షలలో ఉంటుందని చర్చ. ఈ గొడవ విషయం తాత్కాలిక ఉద్యోగి గంగాధర్ ను సంప్రదించగా వాస్తవం అంటూ నిర్ధారించాడు. ఇది ఇలా ఉండగా పలువురు తాత్కాలిక ఉద్యోగులు డబ్బులు చెల్లించి పిఎఫ్ కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం.