ధర్మపురికి పవన్ వారాహి వాహనం వస్తుందా ?

ధర్మపురిలో అభిమానులు సందడే సందడి!
ఎగురుతున్న ఎయిర్ బెలూన్లు.
భారీ భద్రత ఏర్పాట్లు ..

J. Surender Kumar,

ప్రముఖ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం ధర్మపురి క్షేత్రానికి వస్తుందా ? రాదా ,? ఇక్కడ ఆ వాహనంకు పూజలు జరుగుతాయా అనే సందిగ్ధత ఆయన అభిమానులలో నెలకొంది.
హీరో పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం పర్యటన ఖరారు కావడం , ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఆయన వారాహి వాహనం (ఎన్నికల ప్రచార వాహనం) కు. ప్రత్యేక పూజలు చేయించుకోనున్నారు. కొండగట్టు. క్షేత్రంలో స్వామివారి దర్శనం, పార్టీ నేతలతో బృందావన్ రిసార్ట్ లో సమావేశం తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని. దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు..

భారీ బందోబస్తు!.


ఈ మేరకు జగిత్యాల్ డిఎస్పి ప్రకాష్, నేతృత్వంలో పోలీస్ అధికారుల బృందం, జనసేన పార్టీ రాష్ట్ర నేతలు, సోమవారం సాయంత్రం ధర్మపురి ఆలయ. పరిసరాలు పవన్ కళ్యాణ్ వాహన రూట్ మ్యాప్ ను వారు పరిశీలించారు. నంది విగ్రహం నుండి ఆలయం వరకు రహదారిని వారు పరిశీలించారు.. పవన్ కళ్యాణ్ వెంట ఆరు వాహనాల ను ఆలయం ముందు వరకు పోలీసులు అనుమతించ నున్నట్లు సమాచారం. ఆలయంలోకి కేవలం ఇద్దరు లేదా ముగ్గురు జర్నలిస్టులను మాత్రమే పరిమితం చేయాలని, జనసేన రాష్ట్ర నాయకులు , పోలీసు అధికారులు చర్చించుకున్నారు.

హీరో పవన్ కళ్యాణ్ , 32 నరసింహ క్షేత్రాల దర్శన. యాత్రలో భాగంగా, మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తన దర్శన యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
అభిమానుల సందడే సందడి.!


హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు క్షేత్రంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు. నంది విగ్రహం చౌరస్తా వద్ద పవన్ కళ్యాణ్ చిత్రం ముద్రితమైన ఎయిర్ బెలూన్. ఎగురవేశారు.
దాదాపు 100 మంది పోలీసు బలగాలతో భద్రత చర్యలు ఏర్పాటుతోపాటు , పేలుడు పదార్థాలు తనిఖీ బలగాలు, ఇంటిలిజెన్సీ బలగాలు మోహరించాయి.