ధర్మపురిలో 26 నుంచి హత్ సే హత్ జొడో అభియాన్ !

అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

(J. Surender Kumar)

భారత్ జోడో యాత్ర కు కొనసాగింపు గా జనవరి నెల 26 నుండి ధర్మపురి నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ‘ హత్ సే హత్ జోడో అభియాన్’ సామూహిక కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కార్యకర్తల సమావేశంలో అన్నారు.

మంగళవారం ధర్మపురి పట్టణంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర కు కొనసాగింపు జనవరి 26, 2023 నుండి ప్రారంభమై రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. అభియాన్ మూడు వేర్వేరు స్థాయి లలో కార్యక్రమం కొనసాగుతుంది అన్నా రు.
.గ్రామం మరియు బ్లాక్ స్థాయి.,జిల్లా స్థాయి ,రాష్ట్ర స్థాయి లలో నిర్వహించబడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో లో ధర్మపురి మండల అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, బ్లాక్ అద్యక్షుడు కుంట సుధాకర్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు, సంగ నర్సింహులు, ముత్తినెని మల్లేశం, ఇంద్రల మల్లేశం, కాసరపు బాల గౌడ్, రఫియొద్దిన్, సిపతి సత్యనారాయణ, జంగిలి ప్రభాకర్, రాందేని మొగిలి, దాసరి పురుషోత్తం, సర్డ లక్ష్మణ్, అప్పం తిరుపతి, స్తంభంకడి గణేష్, రాజేందర్, ప్రతాప్, గారిగే రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు

ఉచిత బియ్యం పంపిణీ చేయాలి !

ధర్మపురి పట్టణం కాంగ్రెస్ పార్టీ, మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఆధ్వర్యం లో ఉచిత బియ్యం పంపిణీ మరియు అత్యోదయ కార్డులు నిరుపేదలకు పంపిణీ చేయలనీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం స్థానిక తహశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి ఒకటిన పంపిణీ చేయాల్సిన బియ్యం మంగళవారం నాటి వరకు కూడా పంపిణీ చేయకపోవడం అన్నారు.సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సకాలంలో పంపిణీ చేయాలి అని అలాగే కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్నయోజన భారత ప్రభుత్వం యొక్క ప్రాయోజిత కార్యక్రమం దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుటుంబాలకు 35 కిలలో బియ్యం లేదా గోధుమలు సబ్సిడీ ధరలో ఇవ్వడం జరుగుతుంది, అటువంటి అంత్యోదయ కార్డులకు అర్హులైన ప్రజలు ధర్మపురి మండలంలో వేలాది మంది ఉండగా కేవలం పదుల సంఖ్యలో అంత్యోదయ కార్డులు డీలర్ కు ఒకటి చొప్పున ఇవ్వడం మిగతా వారిని విస్మరించడం సమంజసం కాదని ఆరోపించారు. అర్హులైన అందరికీ అందచేయాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో వేముల నాగలక్ష్మి,సంగనబట్ల సంతోషి, జక్కు పద్మ, గరిగే అరుణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట సుధాకర్, యదవ సంఘం మండల అధ్యక్షుడు సంగ నర్సింహులు, ముతినేని మల్లేశం, కసారపు బాలగౌడ్, సర్ద లక్ష్మణ్, రందేని మొగిలి, దాసరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు