స్వాగతం పలికిన ఆలయ అధికారులు!
J. Surender Kumar
ప్రముఖ హీరో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కొండగట్టు నుంచి సాయంత్రం 6 గంటలకు ధర్మపురి క్షేత్రానికి ఆయన చేరుకున్నారు. వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారి, సిబ్బంది పవన్ కళ్యాణ్ వేసి మంగళ వాయిద్యాలు వేదమంత్రాల తో స్వాగతించారు.

యోగా నరసింహస్వామి దర్శించుకున్న పవన్ కళ్యాణ్ కు ఆశీర్వాదం మండపంలో ఆలయ పక్షాన స్వామివారి శేష వస్త్రం, స్వామి చిత్రపటాన్ని, ప్రసాదం అందించారు.

భారీ సంఖ్యలో అభిమానులు ధర్మపురి క్షేత్ రానికి చేరుకొని పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఎగబడ్డారు..

వివేకానంద విగ్రహం నుండి పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి ప్రజలకు, అభిమానులకు, అభివాదం చేస్తూ అంబేద్కర్ , చాకలి ఐలమ్మ,. తెలంగాణ తల్లి నంది విగ్రహం రహదారి గుండా ఆయన ఆలయానికి చేరుకున్నారు.

కొండగట్టు నుంచి దూరంపటికి వస్తుండగా పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనం. నూక పెళ్లి వద్ద టైర్ పంచర్ అయింది. జగిత్యాల వస్తున్న దారిలో నేరెళ్ల గ్రామం వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు.
