ధరూర్, రాజారాం ను కలిపి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి!

కలెక్టర్ కు కౌన్సిలర్ జయశ్రీ వినతి పత్రం!

J. Surender Kumar

జగిత్యాల్ మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలు వివాదం తీవ్ర రూపం దాల్చడంతో 35 వార్డ్ కౌన్సిలర్. అనుమాండ్ల జయశ్రీ బుధవారం జగిత్యాల్ కలెక్టర్ కు మాస్టర్ ప్లాన్ మార్పులు చేర్పులు వివరణలతో వినతి పత్రం ఇచ్చారు.
అందులో వివరాలు ఇలా ఉన్నాయి!

డ్రాఫ్ట్ లో సవరణలు , జగిత్యాల పట్టణ పరిధిలోకి TR నగర్, కలిపిన సందర్భంలో మధ్యలో ఉన్న దరూర్, మరియు రాజారాం గ్రామాలను కూడా కలిపి మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలి అని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతిలకు సంబంధించి గ్రామంలో ఏమి చేయలి అనుకుంటున్నారు. ఏ ఏ జోనులు ఉంటాయి.? ఇండస్ట్రీయల్ జోన్, రీక్రియేషన్ జోన్, పబ్లిక్ సేమిపబ్లిక్ జోన్ మరియు గ్రీన్ జోన్ ఈ జోన్ లలో ఏ జోన్ క్రింద వస్తుంది. గ్రామం మరియు అక్కడ రోడ్లు ఎంత వెడల్పు పూర్తి వివరాలు ఇవ్వకుండా కేవలం మాస్టర్ ప్లాన్ భవిష్యత్తులో కలుపడానికి సమ్మతమే అనే ఒక్క తీర్మాణం చేయించి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించటం వల్ల ఈ రోజు రైతులు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న చోటనే ఈ జోన్లను ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన స్థలాలు మరియు ఇంటి స్థలాలను కూడ ఈ డ్రాఫ్ట్ నుంచి తొలగించి ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలి. అన్నారు.
జగిత్యాల పట్టణ నడిబొడ్డు నుండి ఏర్పడిన నేషనల్ హైవే (యావర్ రోడ్) రోడ్డును ప్రభుత్వ పరిధిలో మార్చే వీలుంది కావున, ఈ నేషనల్ హైవే రోడ్ ను పక్కన ఉన్న బైపాస్ రోడ్ కు మార్చి ఇబ్బందులు లేకుండా. ఉంటుంది ఆ రకంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిందిగా వినతి పత్రంలో కోరింది
ఈ డ్రాఫ్ట్ లో కేవలం పట్టణ పరిధి ఎంతైతో ఉందో అంతే చూపించినారు. కానీ, ఖచ్చితముగా పరిధిలోకి ఈ గ్రామాలు కలిపి పట్టణ విస్తీర్ణం పెంచుతామని ఎక్కడ చూపలేదు. పట్టణ విస్తీర్ణం పెంచే విధంగా చుట్టూ గ్రామాలను కలుపుతూ డ్రాఫ్ట్ తయారుచేయాలి.
మాస్టర్ ప్లాన్ మొట్ట మొదట 1969 మొదలు పెడితే 1989 లో మాస్టర్ ప్లాన్ అధికారిక అమోద ముద్ర పొందినది. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 సం॥లకు మార్చుకోవల్సిన మాస్టర్ ప్లాన్ ను 34 సం,, అయిన ఎటువంటి ప్లాన్ రూపొందించడానికి ముందుకు రాని మున్సిపాలిటీ గత పాలకవర్గం మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి డి.డి.ఎఫ్ కన్సల్టెన్సీ వారికి ఇవ్వగా వారు డ్రాఫ్టు తయారు చేసే దానిపై అవగాహన కల్పించడానికి M.L.A మరియు కౌన్సిలర్స్ కౌండిన్య పంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంలో M.L.A గారు సూచనలు, సలహాలు ఇస్తూ, దానిని తిరిగి రీ సర్వే చేయించి మళ్ళీ డ్రాఫ్ట్ చేయించినారు. అంటే మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ తయారు చేయడానికి దాదాపు 6 సం॥ల కాలం పట్టింది. ఈ డ్రాప్ట్ లో 2041 సం॥ వరకు సంబంధించిన ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఈ డ్రాఫ్ట్ లో జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిన విస్తీర్ణం పెంచుకున్న దాఖలాలు ఏమి కనపడుట లేవు. ప్రస్తుతం ఉన్న డ్రాప్ట్ లో ఉన్న లోపాలను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ అభిప్రాయాల మేరకు డ్రాఫ్ట్ రూపొందించిన చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ కలెక్టరికి ఇచ్చిన వినతిపత్రం లో పేర్కొన్న రు.