J. Surender Kumar,
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు వచ్చే నెల ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్నట్టు శాసనసభ కార్యదర్శి నరసింహచార్యులు ప్రకటించారు. పగలు 12 గంటలకు సభ ప్రారంభం కానున్నట్టు ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 న అసెంబ్లీ లో వార్షిక బడ్జెట్ పెట్టే అవకాశం ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
