స్వామివారిని దర్శించుకున్నా న్యాయవాదులు !
J.Surender Kumar
చుట్టుకొండలు, అటవీ ప్రాంతం, 63 జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య సాంబశివ ఆలయం ఉంది. నేరెళ్ల గ్రామస్తులు భక్తుల దాతల సహకారంతో లక్షలాది రూపాయల నిధులతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పర్యావరణాన్ని రక్షిస్తూ పనులు చేపట్టారు. శ్రీ సాంబశివ ఆలయం ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. భక్తజనంతోపాటు పలువురు న్యాయవాదులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జగిత్యా జిల్లా ధర్మపురి మండలంలోని నేరెళ్ల శ్రీ సాంబశివ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవము సందర్భంగా జిల్లా న్యాయవాదులు సాంబశివున్ని దర్శించుకున్నారు. అర్చకుడుశివశ్రీ ప్రశాంత్ శాస్ర్తీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాండ్ర సురేందర్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్పీ సుబ్రహ్మణ్యం. బసెటి జ్ఞాన ప్రకాష్ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెత్తపు లక్ష్మన్, సీనియర్ న్యాయవాదులు గడ్డం లింగారెడ్డి, కటుకం చంద్ర మోహన్ , రేపల్లె హరికృష్ణ, ధర్మపురి కోర్ట్ ఈసీ మెంబెర్ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ జాజాల రమేష్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కసారపు రాజగౌడ్, సర్పంచ్ ,పురంశెట్టి రెడ్డి, ఎంపీటీసీ రెడ్డవెని సత్యం కాశెట్టి మల్లేశం, వైస్ ఛైర్మెన్ అక్కినపెల్లి బాబు కుమార్, ప్రధాన కార్యదర్శి జాజాల రవీందర్ , సంయుక్త కార్యదర్శి పాదం కొమురయ్య, కోశాధికారి శెర్ల రాజేశం ప్రచార కార్యదర్శి పురంశెట్టి సుధాకర్ ముఖ్య సలహాదారు పైడి గంగారాం సలహాదారులు కసారపు బాలగౌడ్ ,ఉడుత గంగారాం మాడిశెట్టి లక్ష్మన్, రాజరపు రాజేశం ఇరగదిండ్ల వేణు జుంజురు అశోక్, వేముల రమేష్ , చక్రాల శ్రీనివాస్, బొరే మల్లేష్, పైడి మారుతి ,పాల సంబేష్ ,మహేష్ ,అరె ప్రసాద్ ఆకుల మధు తదితరులు మహోత్సవ నిర్వహణ పనులు చేపట్టారు .
