వైశ్య భవన్ లో శ్రీ వాసవి మాతా ఆలయంలో..
J. Surender Kumar,
వాసవి మాతా ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జగిత్యాల పట్టణం మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వరాలయం నుండి 108, ఇత్తడి గంగాలాల పంచదార తో మహిళలు ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు., తదుపరి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు వాసవి మాతా అమ్మవారి కి 108 ఇత్తడి గంగాలల పంచదారతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు., ఈ కార్యక్రమం లో వైశ్య సంఘం అధ్యక్షులు మంచాల కృష్ణ, వాసవి మాతా ఆలయ చైర్మన్, అర్వపల్లి రాజేందర్., ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ భోనగిరి నరేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
