ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ..
పుట్టినరోజు వేడుకలు.!

(J. Surender Kumar)

జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ ఇందిరా భవన్ లో గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అట్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్ లు

గాజుల రాజేందర్, హరికృష్ణ, మైనారిటీ నాయకులు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బండ శంకర్, కౌన్సిలర్లు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పలువురు నేతలు జీవన్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించి కేక్ కట్ చేయించారు.

ధర్మపురి పట్టణంలో..

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, జగిత్యాల్ డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ఆధ్వర్యం ,MLC జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం నంది చౌక్ వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్, మాట్లాడుతూ పొలస అగ్రికల్చర్ కాలేజీ, కొండగట్టు JNTU, కమ్మునుర్ గోదావరి వంతెన, ఉమ్మడి కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రాజీవ్ రహదారి లాంటి గొప్ప అభివృద్ధి పనులు చేసిన మహా నాయకుడు అని అన్నారు.

బీర్పూర్ మండల కేంద్రంలో..

బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ , జెడ్పిటిసి సభ్యురాలు పాత పద్మ రమేష్, వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుపూరి సుభాష్, కొల్వాయి సింగల్ విండో అధ్యక్షులు నవీన్ రావు, ఉమ్మడి మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్, ఎంపిటిసిలు ఆడెపు మల్లేశ్వరి, తిరుపతి, రంగు లక్ష్మణ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జోగిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నారపాక కమలాకర్, బీర్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చీర్నేని రాజేశం, నాయకులు పూడూరి రవీందర్, మెస్రం సురేందర్, రామచంద్రం, బర్రె రాజన్న, ఇమ్మడిశెట్టి గంగాధర్, చీర్నేని రామచంద్రం, యశోద శ్రీనివాస్, ఎనగంటి సతీష్ ,తోట మల్లేష్ ,చుంచు రాజేష్ , నారకట్ల మధుకర్, సబ్బ నవీన్, బంటి తదితరులు పాల్గొన్నారు.