జగిత్యాలలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో
ఆదివారం 10వ తరగతి చదువు తున్న విద్యార్థులకు, శ్రీచైతన్య IIT & NEET అకాడమీ మరియు జాతీయ స్థాయిలో గల REGIS ఆధ్వర్యంలో IIT, NEET పై అవగాహన సదస్సు నిర్వహించారు.,

REGIS Co-ఆర్డినేటర్ బాలాజీ మాట్లాడుతూ, JEE MAINS, ADVANCE & NEET సీట్ సాధించడం కష్టం కాదు, కొద్దిగా కష్టపడితే సీట్ సాధించడం చాల సులభం అని, గత సంవత్సరం నుండి Regis సంస్థ మొట్ట మొదటి సరిగా తెలంగాణ లో జగిత్యాల లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల తో కలిసి పనిచేస్తున్నదని, గతంలో శ్రీచైతన్య జూనియర్ కళాశాల నుండి 4గురు విద్యార్థులు మెడికల్ సీట్స్,ఇద్దరు IIT సీట్స్ సాధించారు., REGIS మరో కోఆర్డినేటర్ అమర్ సర్దార్, మాట్లాడుతూ జాతీయ స్థాయిలో IIT, NEET Colleges ఎన్ని ఉన్నాయి, seats ఎన్ని ఉన్నాయి, ఎన్ని marks వస్తే సీట్ వస్తుంది, ఎలా చదవాలి అని వివరంగా చెప్పారు.

శ్రీచైతన్య జూనియర్ కళాశాల చైర్మన్ ముసిపట్ల రాజేందర్ మాట్లాడుతూ, జగిత్యాల విద్యార్థులు IIT, NEET చదువుల కోసం ఇతర పట్టణాలకు వెళ్లి ఇబ్బంది పడుతూ, అధిక డబ్బులు ఖర్చు చేసుకొంటున్నారని, దాని కోసం జాతీయ స్థాయిలో గల REGIS సంస్థ ను జగిత్యాల లకు తీసుకరావడం జరిగిందని చెప్పారు. జగిత్యాల ప్రాంత విద్యార్థులు ఈ అవకాశం వినియోగించు కోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమం లో Regis స్టాఫ్, జగిత్యాల జిల్లా వివిధ ప్రాంతం నుండి వచ్చిన పదవ తరగతి చదువు తున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు