ఇథనాల్ ఇండస్ట్రీ వద్దు – మా భూములు అన్యాయంగా లాక్కోవద్దు!

కలెక్టర్ కు బాధిత రైతుల విజ్ఞప్తి !

J. Surender Kumar,

జగిత్యాల జిల్లా మెటుపల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామ శివారులోని సర్వే నెం. 498, 506 యందు గల పట్టాలు మంజూరు చేసిన భూములు మా వద్ద నుండి నిబందనలకు విరుద్ధంగా, చట్టవ్యతిరేకంగా, బలవంతంగా తీసుకోవద్దని బాధిత రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ గుగులోతు రవి కి విజ్ఞప్తి చేశారు


బాధిత రైతులు అందరూ ఆందోళన చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇథనాల్ ఇండస్ట్రీ పేరుతో 50 ఏండ్ల క్రితం పట్టాలు ఇచ్చిన భూములను మా నుండి లాక్కుంటున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వగా మిగిలిన ప్రభుత్వ భూముల్లో సైతం ఇండస్ట్రియల్ పార్క్ వద్దు – విద్యా సంస్థలే ముద్దు అంటూ నినాదాలు చేశారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు (టీజేఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్) కంతి మోహన్ రెడ్డి, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, నాయకులు పసునూరి శ్రీనివాస్, కంతి రమేష్, జిల్లాపెల్లి దిలీప్, వన్నెల శశి, మెట్ల చిట్టా పూర్ గ్రామ ఐక్యవేదిక నాయకులు పులి సంజీవ్, గొర్రె భీమన్న, తుపాకుల దేవరాజ్, చింతకుంట దేవయ్య, అల్లకుంట లింగన్న గ్రామ రైతులు గంగాధర్, గంగ నర్సయ్య, లక్ష్మణ్, పోచయ్య, స్వామి, సంతోషిని, లక్ష్మీ, నర్సు, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.