మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J. Surender Kumar
జిల్లాలోని ప్రజలంతా కంటి పరీక్షలు చేయించుకుని, అవసరమైన వారు కళ్ళద్దాలు తీసుకొని కళ్ళను సురక్షితంగా ఉంచుకోవాలని, కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అయిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లో బ్రాహ్మణ సంఘం లో గురువారం ఏర్పాటు చేసిన రెండవ కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
కంటి వెలుగు అనగానే కంటి చూపు పరీక్ష అనే తేలిక భావం ఉంటుందని, కానీ ప్రతి మనిషికి కంటి చూపు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించాలని, నివారించదగ్గ అంధత్వాన్ని మనం పరీక్షలు చేసుకొని వెంటనే నివారించు కోవాలని, గతంలో కంటి పరీక్షలను లయన్స్ క్లబ్, ఎల్.ఐ సి., ఇతర ఎన్.జి. ఓ. సంస్థలు అప్పుడప్పుడు, అక్కడక్కడ చేపట్టేవారని మంత్రి గుర్తు చేశారు.
కంటి చూపు పై దేశంలో ఒక అధ్యయనం జరిగిన సందర్భంలో 50 శాతం నివారించ దగ్గ అంధత్వం భారత దేశంలో ఉన్నదని కనుగొన్న తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది సామాజిక బాధ్యతగా భావించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదవారు, కూలీలు, విద్యార్థిని, విద్యార్థులకు

తెలవకుండానే సైట్ ఉంటుందని, వారు పరీక్ష చేసుకునే లోగా అది కాస్తా పెరిగి ఇబ్బందులు ఏర్పడతాయని, చదువుకునే పిల్లలకు ఇది ముఖ్యమైనది అని, ఇలాంటి క్యాంప్ లు ద్వారా ఉచితంగా పరీక్ష చేసుకొని నియంత్రణలో ఉంచుకోవచ్చు అని, మందులతో పాటు అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు అందించాలానే ఉద్దేశ్యంతో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
కంటి వెలుగు మొదటి విడత విజయవంతంగా జరిగిందని, దాదాపు కోటి 54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి వాళ్లకు కావాల్సిన మందులు, కంటి అద్దాలను పూర్తి స్థాయిలో అందించినటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి కంటి చూపు సమస్యలు నివారించుటకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో 34 బృందాల ద్వారా 100 పని దినాలలో ప్రతి గ్రామంలో మున్సిపల్ వార్డు పరిధిలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అధికారులు సూచించిన విధంగా సకాలంలో హాజరై తప్పనిసరిగా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి కోరారు.

జిల్లాలో 46 వైద్య బృందాల ద్వారా జనవరి 19 నుండి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి 18 సంవత్సారాల వయస్సు, పై బడిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటుగా, అవసరమైన వారికి కంటి అద్దాలను అందించే బృహత్తర పథకమని, ప్రజలు తమ, తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కంటి వెలుగు శిబిరాల తేదీలను గుర్తు పెట్టుకొని ఆయా తేదీల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , నాయకులు సౌళ్ల భీమన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, వైస్ చైర్మన్ సునీల్, అదనపు కలెక్టర్ మకరంద్, జిల్లా వైద్య అధికారి శ్రీధర్, కౌన్సిలర్ లు, మునిసిపల్ కమిషనర్, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.