జగిత్యాల లో పోచమ్మ కు చలి బోనాలు !

అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి!

J. Surender Kumar,

జగిత్యాల జిల్లా కేంద్రంలో పోచమ్మ తల్లి దేవాలయంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పోచమ్మ దేవతకు చలి బోనాలను ఘనంగా సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం పోచమ్మ దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది.

ప్రతి ఏటా మాఘమాసం ప్రారంభంలో అమ్మవారికి చలి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు. ముందు రోజు రాత్రి మహిళలు స్నానాలచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం వండి తెల్ల వారి ఉదయం అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మ వారికి చలి బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సమేతంగా చలి బోనం సమర్పించి పోచమ్మ తల్లి ఆలయ ఆవరణలో నైవేద్యంగా చలి బోనం ఆరగించడం ప్రత్యేకత.