ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ..
(J. Surender Kumar)
జగిత్యాల పట్టణంలో నీ వర్తక సంఘ భవనంలో ఫుడ్ లైసెన్సు జారీ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.
ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు బాపూజీ సంబంధిత పత్రం లను పరిశీలించి లైసెన్సులు జారీ చేశారు., సంవత్సరమునకు ₹12 లక్షలకు పైగా టర్నోవరు కలిగిన వ్యాపారస్తులు సంవత్సరంనకు ₹ 2000/-రూపాయల రుసుము చెల్లించగా, సూపర్ మార్కెట్ ప్యాకింగ్ చేయువారు సంవత్సరమునకు ₹ 3000/- మరియు రైస్ మిల్లర్స్ సంవత్సరమునకు ₹ 5000/- రూపాయల ప్రభుత్వ రుసుము చెల్లించి లైసెన్సలు పొందారు.,

తిను బండారాలు క్రయ విక్రయాలు జరిపే, వ్యాపార సంస్థ ప్రాంగణంలో కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ లైసెన్సును ప్రతి ఒక్కరు నిబంధనల ప్రకారం కలిగి ఉండాలి, ఇదే సమయంలో గతంలో లైసెన్సు కలిగి ఉండి గడువు ముగిసిన వారు కూడా రెన్యువల్ చేయించుకున్నారు. ఈ సదస్సులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బోయినపల్లి ప్రశాంత్ రావు ఫుడ్ డెసిగ్నేటరీ ఆఫీసర్ బాపూజీ, వారి సిబ్బంది, వర్తక సంఘం నాయకులు, వర్తకులు పాల్గొన్నారు..