J. Surender Kumar,
జగిత్యాల రూరల్ మండలం సోమన్ పల్లి గ్రామానికి చెందిన అర్ఎంపి రవి తన అనుచరులు బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన 30మందితో సోమవారం బి అర్ ఎస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ ల సమక్షంలో పార్టీ లో చేరారు. బి ఆర్ ఎస్ పార్టీ కండువాల ను వారికి కప్పి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ లు. స్వాగతించారు.

గ్రామంలో ఎస్సీ కాలనీ లో 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి, గ్రామంలో ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహయనిధి ద్వారా మంజూరైన ₹ 30 వేల రూపాయల విలువగల చెక్కులను అందజేశారు., ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ సింగం అరుణ అంజన్న,ఉప సర్పంచ్ గంగాధర్,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,
మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వరి, MEO గాయత్రి,.నాయకులు తదితరులు పాల్గొన్నారు.