జగిత్యాలలో ఆల్ ఇండియా ముషాయిరా!

ఈనెల 29న…

J. Surender Kumar,

జగిత్యాల పట్టణంలో ఈ నెల 29 ఆల్ ఇండియా ముషారాయి తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ముషారాయి పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉర్దూ మధురమైన భాష అని, ముషాయిరా నిర్వహిస్తున్న ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ను అభినందించి ఉర్దూ ప్రేమికులు ముషాయిరాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


పట్టణంలోని టౌన్ హాల్ ఎదురుగా ఉన్న పార్కులో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముజాహిద్ ఆదిల్, జనరల్ సెక్రటరీ జమీర్ అలీ అద్నాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇఫ్తికార్ అలీ .జుబైర్, కన్వీనర్ ఫజల్ బేగ్, సయ్యద్ అహ్మద్, బీఆర్‌ఎస్‌తో పాటు కన్వీనర్ ముషైరా అబ్దుల్ ముజాహిద్ ఆదిల్, పార్టీ నాయకులు పాల్గొన్నారు
.