సైకిల్ మోటార్ పై ఎమ్మెల్యే సంజయ్ సవారి !
పథకాల అందుతున్నాయా అంటూ ప్రజలతో ముచ్చట!
(J. Surender Kumar)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో, వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ల, సంక్షేమ పథకాలు పంపిణీలో అమలు చేస్తున్న పాలసీనే తెలంగాణలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అమలు చేస్తున్నారా ? అంటే. అదే పాలసీని అమలు చేస్తున్నట్టే లబ్ధిదారులకు, కొందరికి అగిపిస్తున్నది. వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, శనివారం. పట్టణంలోని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ, ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. పట్టణంలో 47 మంది లబ్ధిదారులకు ₹ 19 లక్షల 77 వేల సీఎం సహాయ నిధి చెక్కులను వారికి అందజేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన.₹ 52 లక్షల రూపాయల చెక్కులను మహిళలకు అందజేశారు.

ఎమ్మెల్యే స్వయంగా ద్విచక్ర వాహనం నడిపిస్తూ, లబ్ధిదారుల వాడల్లో తిరుగుతుండగా, కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు, చోటామోటా బీఆర్ఎస్ లీడర్లు, సైతం ఆయన వెంట ప్రజలకు చేరువ అవుతున్నారు,

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు ఇదే పాలసీని అమలు చేస్తారు కాబోలు, వేచి చూడాల్సిందే.