కలెక్టర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ వినతిపత్రం!
(J.Surender Kumar)
జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు వచ్చాయని, మళ్ళీ రీ సర్వే చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కలెక్టర్ కు మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ,అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేస్తామని మున్సిపల్ ఛైర్పెర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సర్వే చేయలేదని, అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపు చేశారని అన్నారు. ఈనెల 8వరకు కూడా మీసేవ కేంద్రంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, మున్సిపల్ ఛైర్పెర్సన్ అన్నారు. ఈకార్యక్రమంలో వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్స్ నాయకులు పాల్గొన్నారు…..