వైస్ చైర్మన్ కు తాత్కాలిక బాధ్యతలు !
J. Surender Kumar,
జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానా ప్రక్రియ ఆమడ దూరంలో ఉన్నట్టు సమాచారం. వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న గోలి శ్రీనివాస్ కు తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలను అధికారికంగా అప్పగించనున్నట్లు తెలిసింది.
బుధవారం మున్సిపల్. చైర్ పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పై పలు ఆరోపణలు చేస్తూ తన చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందె.
జగిత్యాల బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల సమాచారం బుధవారం రాత్రి ప్రగతి భవన్ కు చేరినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కౌన్సిలర్లు, తెరపైకి తమ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కావాలంటూ విందు రాజకీయాలు నడిపిస్తున్న సమాచారం. ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లలో మరో నాలుగు వర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు ఇంటెలిజ వర్గాలు సంబంధిత శాఖ మంత్రికి నివేదికలు అందించినట్లు తెలిసింది.
మూడు సంవత్సరాలగా చైర్మన్ పదవి కాలంలో మున్సిపల్ పై వచ్చిన ఫిర్యాదులు, ప్రోటోకాల్ అంశాలు, డిజిల్ కొనుగోలు, తాత్కాలిక సిబ్బంది నియామకం, అధికారులపై ఏసీబీ దాడుల, తదితర అంశాలపై జరిగిన విచారణ నివేదికలను పరిశీలించాల్సిందిగా. ఆ శాఖ ఉన్నతాధికారులకు మున్సిపల్ మంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చైర్ పర్సన్ రాజీనామా అంశా పై అధిష్టానం పెద్దగా స్పందించినట్టు సమాచారం. జగిత్యాల రూరల్ మండలం పరిషత్ అధ్యక్ష స్థానం గత కొన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్న , ఎంపీటీసీ ఎన్నిక నిర్వహించకపోవడం ఉపాధ్యక్షుడే నేటి వరకు అధ్యక్షుని హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
గురువారం కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సంజయ్ సమావేశం ఏర్పాటుచేసి తనపై, భోగ శ్రావణి చేసిన ఆరోపణలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.