జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి బుధవారం తన పదవికి రాజీనామా చేయడం వెనుక, మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు ఆందోళనలా.,? అధికార టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల,? అనే అంశంలో వాస్తవాలు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు, చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన . డాక్టర్ భోగ శ్రావణి కి మినహా ఇతరులకు తెలిసే అవకాశాలు లేవు. అధికార, ప్రతిపక్ష ,రాజకీయ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో. పలు అంశాల్లో జరిగిన జరుగుతున్న రాజకీయ చర్చల సారాంశం మేరకు రాజకీయ ఊహాగాహనాలు ఇలా కొనసాగుతున్నాయి.
కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ రద్దు ఆందోళన,!
రాష్ట్రంలో మొదటిసారి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ రద్దుకు రైతులు అక్కడి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాలు ,ఆందోళన కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన ఉధృతంగా మారింది. రైతుల ఆందోళనకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, కామారెడ్డిలో ధర్నాలో కూర్చున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతుగా కామారెడ్డి కి వెళ్లారు. పోలీసులు సంజయ్ అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. రైతులకు మద్దతుగా ఇద్దరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేసి జేఏసీ నాయకులకు రాజీనామా పత్రాలు ఇచ్చారు. కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు రైతులకు మద్దతు ప్రకటించిన వారి ఉనికి మాత్రమే కనబడింది. దాదాపు 40 రోజుల పాటు ఆందోళన కొనసాగింది.
జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ రద్దు ఆందోళనలో
జగిత్యాల మున్సిపాలిటీ లో మాస్టర్ ప్లాన్ లో చేర్చిన మోతే , నర్సింగాపూర్ తిమ్మాపూర్ . తదితర గ్రామాల రద్దు కోసం రైతులు కామారెడ్డి తరహాలో చేపట్టిన ఆందోళన నేపథ్యంలో రాస్తారోకో , ధర్నాలు, చేపట్టి వినతి పత్రాలు ఇచ్చారు. గ్రామ ప్రజలు, రైతులు ఐక్య కార్యాచరణగా ఎమ్మెల్యే సంజయ్ ఇంటి ముందు ధర్నా చేశారు, ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు కానీ కలెక్టర్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ముట్టడి పిలుపు ఇవ్వకపోవడం ప్రత్యేకం. రైతుల ఆందోళనలకు మద్దతుగా. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో, సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కి వారికి సంఘీభావం ప్రకటించారు. దాదాపు 15 రోజులపాటు రైతులు చేపట్టిన ధర్నాలు ,రాస్తారోకోలు ,ఎమ్మెల్యే ఇంటి ముట్టడి, ఆందోళనలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వారికి. మాస్టర్ ప్లాన్ గూర్చి వివరిస్తూ , నేను తప్పకుండా రద్దు చేస్తాను, నేను ప్రజల పక్షంగా ఉంటాను. మీరు ఆందోళన చెందకండి మీ భూములు పోవు, మీకు అన్యాయం చేయను అంటూ అనేక విధాల వారికి నచ్చే చెపుతూ, నన్ను నమ్మండి నేను మీకు ద్రోహం చేయను అంటూ పలుమార్లు ప్రాధాయపడ్డారు. ఎమ్మెల్యే సంఘీభావంగా.మున్సిపల్ చైర్ పర్సన్ , జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, కీలక నామినేటెడ్ పదవులు ఉన్న ఈ జిల్లా నాయకులు. ఎమ్మెల్యే సంజయ్ వెంట లేరు. మా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామంటూ రైతులను కలిసి హామీ ఇచ్చిన సందర్భము లేదు. ఈ అంశంలో రైతులతో వారు సంప్రదింపులు జరపలేదు అనేది జగమెరిగిన సత్యం. బిజెపి పార్లమెంటరీ పరిధిలో ఉన్న జగిత్యాల్ మున్సిపాలిటీ లో రైతులు ఆందోళన కు నిజాంబాద్ ఎంపీ. ధర్మపురి అరవింద్ , బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి కౌన్సిలర్లు ,శ్రేణులు రైతుల ఆందోళనకు మద్దతుగా సంఘీభావం తెలిపిన సందర్భం లేదు. కౌన్సిల్లో ఉన్న ముగ్గురు బిజెపి కౌన్సిలర్లు తమ పదవుల రాజీనామా ఊసే లేదు.మాస్టర్ ప్లాన్ రద్దు మునిసిపల్ తీర్మానం రోజున గేటు ముందు మద్దతుగా బిజెపి నాయకుడు రవీందర్ రెడ్డి మాత్రమే ఉనికి చాటుకున్నారు. బిజెపి నాయకత్వం కామారెడ్డి, జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ రద్దు రైతుల ఆందోళనలకు.మద్దతు పలికిన వివక్షత తీరు విమర్శలకు గురి అవుతున్నది. ఈ నేపథ్యంలోనే జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజకీయ వ్యవహార శైలి అనుమానాలకు, ఆరోపణలకు. అవకాశం ఇచ్చింది అనేది చర్చ.
చైర్ పర్సన్ అధ్యక్షతన మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానం !
చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానించి ప్రభుత్వానికి పంపిన మరుసటి రోజు కౌన్సిలర్ అవిశ్వాసం పై సంతకాలు చేయడం చర్చలకు అవకాశం కల్పిస్తుంది. ( బుధవారం చైర్ పర్సన్ స్థానిక ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తూ తన చైర్మన్ పదవికి రాజీనామా పత్రాన్ని. ప్రదర్శించారు) చైర్ పర్సన్ విలేకరుల సమావేశంలో రోధిస్తూ వివరించిన వివరాలు. మూడు సంవత్సరాలుగా, ఎమ్మెల్యే తనను నరకయాతన పేడుతున్నాడని, బీసీ బిడ్డను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నాడని, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవితక్క ను నాకు తెలియకుండా వారి వద్దకు. వెళ్ళవద్దని ఆంక్షలు పెట్టినట్టు, చేసిన తదితర ఆరోపణలు ప్రచారమాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కౌన్సిల్లో ప్రతిపక్షంలో ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు బిజెపి ,ఒక్కరు ఎంఐఎం ,ఒకరు స్వతంత్ర కౌన్సిలర్లు ఉన్న చైర్ పర్సన్ భోగ శ్రావణి మీడియా సమావేశంలో వారు అగుపించలేదు.
రాజీ యత్నం లోనే రాజీనామా చేశారా ?
అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 27 మంది కౌన్సిలర్ల సంఖ్య బుధవారం నాటికి 35కు చేరింది. చైర్ పర్సన్ , కౌన్సిలర్ మధ్య రాజీ కోసం కోరుట్ల శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, స్థానిక ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎల్ రమణ. బుధవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలర్లతో రాజీ. చేయించి అవిశ్వాసం వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టడమా ? చైర్ పర్సన్ భోగ శ్రావణి తో రాజీనామా చేయించడమా ? అనే అంశంపై వారు ఆలోచించినట్టు సమాచారం.. ఈ నేపథ్యంలో చైర్ పర్సన్ బోగ శ్రావణి కి ఆమె సన్నితులకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.