జగిత్యాల పోలీసుల అదుపులోని నిందితుడు అదృశ్యం!

కోట్లాది రూపాయల అప్పులు కొల్లగొట్టిన కేసులో..

( J. Surender Kumar)

జగిత్యాల పోలీసుల అదుపులో ఉన్న రేగొండ నరేష్ అనే నిందితుడు. మంగళవారం వారి అదుపులో నుంచి అదృశ్యమైనట్టు సమాచారం. సామాజిక, సంఘ సేవకుడిగా చలామణి అవుతు నమ్మిన వారి దగ్గర అప్పుల తీసుకొని కొట్లాది రూపాయలు కొల్లగొట్టిన నిరారోపణల కేసులు అతనిపై  ఉన్నాయి .

వివరాల్లోకి వెళితే!

2021 సెప్టెంబర్ మాసంలో నిందితుడు నరేష్  జగిత్యాల నుంచి అదృశ్యమయ్యాడు. విషయం తెలిసిన బాధితులు పోలీస్ స్టేషన్ కు బారులుతీరి  అప్పుల వివరాలతో నరేష్ పై ఫిర్యాదులు చేశారు.  జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సంవత్సర కాలం పాటు రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ గాలించి నిఘా పెట్టారు.
జనవరి మొదటి వారంలో సారంగాపూర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాధితుడు సాయికిరణ్ కొంతకాలం హైదరాబాదులో మాటువేసి  పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించాడు. దీంతో నరేష్ బాధితులు మరోసారి పోలీస్ స్టేషన్ కు చేరుకొని న్యాయం కోసం పడిగాపులు పడ్డారు.


రహస్య ప్రాంతంలో విచారించరా ?
పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు బాధితుల తాకిడి అధికం కావడంతో జిల్లాలోని  అటవీ ప్రాంత పోలీస్ స్టేషన్ కు తరలించి ఇంటరాగేషన్ చేసినట్టు సమాచారం. నరేష్ ఇచ్చిన సమాచారంతో కొంతమందిని  తాకట్టు పెట్టిన బంగారం గురించి విచారించినట్టు తెలిసింది.
నిందితుడు నరేష్ కు కాపలాగా, షిఫ్టుల వారిగా ఉన్న వారితో తనను వదిలేయండి, మీరు ఏది కోరితే అది ఇస్తాను అంటూ పలుమార్లు వారిని నరేష్ ప్రాధేయపడి ప్రసన్నం కోసం ప్రయత్నాలు చేసినట్టు చర్చ.   ఈ ఉదాంతం.పై నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి.  ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్ నుంచి నరేష్ తప్పించుకున్నాడా ?  పోలీస్ ఎస్కార్డు కస్టడీ నుంచి  తప్పించుకున్నాడా ? అనే విషయంలో స్పష్టత లేదు. పోలీసులు ఈ వివరాలను ప్రకటన జారీ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు. లేదా ఆయా పోలీస్ స్టేషన్లలో, పట్టణంలోని సీసీ ఫుటేజ్ లు పరిశీలిస్తే. కొంతమేర తెలిసే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉండగా గతంలో నిందితుడు నరేష్ కు ప్రముఖులతో , రాజకీయ నాయకులతో, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో, సామాజిక సంఘ సేవకుడిగా పరిచయాలు, స్నేహ బంధాలు కలిగి ఉన్న విషయం జగమెరిగిన సత్యం. నిందితుడు నరేష్ అదృశ్యం తీరు పై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.