అభిమాని మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు !
రాయపట్నం కరీంనగర్ రోడ్డులో ప్రమాదం !
J. Surender Kumar,.
జనసేన పార్టీ అధినేత ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పర్యటనలో మంగళవారం అపశృతి జరిగింది. ఫలితంగా ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసు వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి!

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ , వాహన శ్రేణి రాయపట్నం గుండా కరీంనగర్ వైపు వెళ్లాయి. పవన్ కళ్యాణ్ ను చూడ్డానికి ధర్మపురి కి ఆయన అభిమానులు ఆ వాహన శ్రేణి వెనుక ర్యాలీగా బైక్ పై ఆయన అభిమానులు కె.రాజ్ కుమార్, జక్కుల అంజి వెళ్ళారు. వెలగటూర్ పోలీస్ స్టేషన్ పరిధి కిషన్ రావుపేట్ సమీపంలో. బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీ కొట్టి కారు ఢీకొన్నారు. ప్రమాద స్థలంలోనే ఇదే పోలీస్ స్టేషన్ పరిధి వెంకటరావుపేట్ కు చెందిన కూస రాజ్ కుమార్,,(20) ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన జక్కుల అంజి కాలు విరిగింది. కిషన్రావుపేట్ గ్రామానికి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ నీలం సాగర్ లకు తీవ్ర రక్త గాయాలై ఎముకలు విరిగాయి.

ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే వెల్గటూర్ ఎస్సై నరేష్, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు
