100 మంది మహిళలపై లైంగిక వేధింపులు!
స్వయం ప్రకటిత దేవుడిగా బిల్డప్!
J. Surender Kumar
కొన్ని సంవత్సరాల క్రితం ఓ తెలుగు సినిమాలో కమెడియన్ పేరు ” జిలేబి” కానీ నిజ జీవితంలో ఓ కామ పిచాచి మహిళల పై లైంగిక వేధింపులకు పాల్పడిన వాడి పేరు “జిలేబి”నాటి సినిమా పేరు ప్రేక్షకులకు హాస్యాన్ని అందిస్తే, నేడు కామపిశాచి పేరు అసైయాన్ని, ఆశ్చర్యాన్ని బాధితులకు కలిగిస్తున్నది.

జిలేబి బాబా నేర చరిత్ర!
దాదాపు 100 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా కోర్టు-కమ్-ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం స్వయం ప్రకటిత దేవుడ్ని 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి బల్వంత్ సింగ్ జనవరి 5న బిల్లు రామ్, అలియాస్ అమరపురి, అలియాస్ జలేబీ బాబాను దోషిగా నిర్ధారించారు. శనివారం శిక్షను ఖరారు చేశారు. ₹ 35,000 జరిమానాను కోర్టు విధించింది.

‘జలేబీ బాబా’ పై సెక్షన్‌లు 292, 293, 294 , 376 (రేప్), 384 , కింద నమోదయింది . 509 , పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్లు మరియు IT. చట్టంలోని సెక్షన్ 67A, అప్పటి తోహానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు పై జూలై 19, 2018. పై కేసు నమోదు చేశారు.
పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానంటూ మహిళలపై అత్యాచారం చేసిన జిలేబీ బాబాను. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచారు. ఈ కీచక బాబాకు కోర్టు శిక్ష విధించింది. సంచలనం రేపిన జిలేబీ బాబా వ్యవహారం హరియాణా రాష్ట్రానికి చెందినది.. జిలేబీ బాబా అసలుపేరు అమర్‌వీర్. పంజాబ్‌లోని మాన్సా్కు చెందిన వాడు. ఇరవై ఏళ్ల క్రితం భార్యతో సహా హరియాణాకు వచ్చిన అమర్‌పురి, తహానా రైల్వే రోడ్డులో, జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్లకు భార్య మృతి చెందింది. రెండేళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి జనాల దృష్టిని ఆకర్షించాడు. దెయ్యాలను, భూతాలను వదిలిస్తామని దేవుడిగా స్వయంగా ప్రకటించుకున్నాడు, ప్రచారం చేసుకున్నాడు. మాయ మాటలు నమ్మిన కొందరు మహిళలు అతడి దగ్గరకి వెళ్లారు. ఈ క్రమంలోనే వారిని లొంగదీసుకున్నాడు. దెయ్యాలను, భూతాలను వదిలించే క్రమంలో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజల, నిర్వహించి తీర్థప్రసాదాల పేరిట ద్రవంలో, ప్రసాదాలలో , మత్తుమందు కలిపి వారితో తాగించేవాడు. వారు స్పృహ కోల్పోగానే అకృత్యాలకు పాల్పడేవాడు. అంతేకాకుండా వీడియోలు సైతం తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. వారి నుంచి డబ్బు డిమాండ్ చేసేవాడు. మరికొందరిని తనతో రిలేషన్ కొనసాగించమని వేధించేవాడు.
ఈ క్రమంలో జిలేబీ బాబా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. మరికొందరు బాధిత మహిళలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిలేజీ బాబా బాగోతం వెలుగు చూసింది. 2018లో ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాలో ఉన్న జిలేబీబాబా నివాసంపై పోలీసులు దాడి చేసి, తనిఖీలు చేయగా 120కి. పైగా వీడియోలు వారికి పట్టుబడ్డాయి. వీటితోపాటు కొన్ని మత్తుపదార్ధాలను, కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోలన్నీ మొబైల్ ఫోన్లో ద్వారా చిత్రీకరించినట్లు గుర్తించారు. నిందితుడి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఆ కీచకుడికి ఫతేహాబాద్ కోర్టు జనవరి 7 (శనివారం)న శిక్ష ఖరారు చేసి తీర్పు రిజర్వులో ఉంచి మంగళవారం ప్రకటించింది.