ఒక్కరోజే ఎక్సైజ్ శాఖకు ₹215.74 కోట్ల ఆదాయం!
డిసెంబర్ 31, ఒక్కరోజు అమ్మకాలలో..!
J.Surender Kumar
నూతన సంవత్సరం 2023 ను ఉత్సాహంగా, ఊగిపోతు స్వాగతించారు, 2022 సంవత్సరం తమకు చేదు అనుభవాలు ఇచ్చిందని మనస్థాపంతో కొందరు, తమకు అచ్చి వచ్చిన సంవత్సర కాల పరిమితి నేటితో ముగిసిపోతుందనే బాధతో కొందరు, డిసెంబర్ 31న కడుపు నిండా తాగారు. దీంతో ఒక్కరోజే ఎక్సైజ్ శాఖకు ₹215 కోట్ల 74 లక్షల ఆదాయంతో ఖజానా. నింపారు.

వివరాలు ఇలా ఉన్నాయి
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుండి 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసుల అమ్మకాలు జరిగాయి.
సుమారుగా ఒక లక్ష 28వేల 455 కేసుల బీర్ కేసుల అమ్మకాలు. జరిగాయి
హైదరాబాద్ 1 డిపోలో-₹16కోట్ల 90 లక్షలు ఆదాయం

హైదరాబాద్ 2 డిపో లో ₹.20 కోట్ల 78 లక్షలు. ఆదాయం వచ్చింది.
హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం ₹37 కోట్ల 68 లక్షలు..తో పాటు రాష్ట్రంలో మరో 17 డిపోలలో జరిగిన మద్యం అమ్మకాల వల్ల ₹215.74 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది.
