J. Surender Kumar,
అభిమానం వ్యక్తం చేయడానికి ఖరీదైన శాలువాలు, పూలదండలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ద్వారా చాటుకోవడం ఆర్థిక అంశంతో ముడిపడి ఉన్నందున ఓ అభిమాని వాటి జోలికి పోలేదు. తాము నమ్ముకున్న వృత్తి ద్వారానే తమ అభిమానులకు అందంగా, ఆకర్షణీయంగా బహుమతులను అపురూపంగా తయారుచేసి అందిస్తూ అభిమానం చాటుకుంటున్న సంఘటనలు, సందర్భాలు అనేకం. తన అభిమాన నాయకుడు, మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాన్ని కలప పై చెక్కి ధర్మపురిలో గురువారం ఓ అభిమాని ఆయనకు అందించి అభిమానం చాటుకున్న సంఘటన చోటుచేసుకుంది.

సిరిసిల్ల కు చెందిన నేత కార్మికుడు పరంధాం లాంటి ప్రతిభ, ఒరిస్సా కు చెందిన పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ తరహా ప్రతిభ ,నైపుణ్యాలు లేకున్నా, అభిమానం చాటుకోవడంలో తానేమి తక్కువ కాదని జగిత్యాల మండలం సంగంపల్లి కి చెందిన వడ్రంగి గుగ్గిళ్ళ వెంకటేష్, చాటుకున్నాడు .

అతడి ప్రతిభ పాటవానికి మంత్రి తో పాటు అక్కడ ఉన్న అనుచరులు సైతం వెంకటేష్ తన కుల వృత్తి నైపుణ్యంతో మంత్రి పట్ల చాటుకున్న అభిమానం వారిని అబ్బుర పరిచింది. అని చెప్పుకోవాల్సిందే.