కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం  సీఎం సహాయ నిధి  పేదలకు వరం !

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

J. Surender Kumar,

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం  అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  అన్నారు.
శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ధర్మపురి మండలానికి మంజూరు ఊ కళ్యాణ లక్ష్మీ – షాదీముబారక్ 12 లబ్దిదారులకు రూ. 12,01,392 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
వివిధ కారణాల వల్ల అనారోగ్యం పాలైన వారు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని, ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి 62 మంది లబ్ధిదారులకు ₹20,034,500 విలువ గల చెక్కుల పంపిణీ  చేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….
కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది. నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.


మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, యంపిపి చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, గొల్లపల్లి జెడ్పీటీసీ గొస్కుల జలెంధర్  డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, వైస్ చైర్మన్ సునీల్, సౌళ్ల సురేష్, పార్టీ అధ్యక్షులు శేఖర్ కౌన్సిలర్ లు, ఆయా గ్రామ సర్పంచ్ లు పాల్గొన్నారు.