ఎమ్మెల్యే సంజయ్ కుమార్!.
J.Surender Kumar,
ప్రజా ప్రతినిదులు,అధికారుల కృషితో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
పట్టణలో శుభమస్తు కన్వెన్షన్ లో గురువారం జరిగిన కంటి వెలుగు రెండవ విడత సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ
కంటి వెలుగు చాలా గొప్ప కార్యక్రమం. ప్రజా ప్రతినిదులు, అధికారుల కృషితో కంటి వెలుగు విజయవంతం అవుతుంది. అన్నారు.
ప్రజాప్రతినిదులు, అధికారులు మంచి అవకాశంగా భావించి సేవా చేసే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారు. ప్రపంచం లోనే అత్యధిక గుడ్డి వారు భారత దేశం లోనే ఉన్నారు.

రాష్ట్రాల 30 లక్షల కంటి అద్దాలు సిద్దంగా ఉన్నాయి..
గతంలో కోటి మందికి పైగా చికిత్స లు అందించాము.
కంటి వెలుగు రెండవ దశలో ఆర్డర్ పై కంటి అద్దాలు సంబంధిత PHC వారికి బార్ కోడ్ మరియు ఇంటి నెంబర్ తో సహా రావడం జరుగుతుంది. అన్నారు.
జగిత్యాల పట్టణం లో 6 బృందాలను వార్డు లో సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు.
కంటి వెలుగు రెండవ దశ గిన్నిస్ బుక్ లో ఎక్కే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, కమిషనర్ డా.నరేష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, DE రాజేశ్వర్, మెప్మ ఏ ఓ శ్రీనివాస్, వైద్యులు, కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రినీ సందర్శించిన ఎమ్మెల్యే!

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రినీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించారు. DME తో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఎమ్మేల్యే, ఆసుపత్రి లో పేషంట్ లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు..,ఆసుపత్రి శానిటేషన్ సరిగా చేయాలని, పేషంట్ లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందని,

వైద్యులు నిరంతరం రోగుల పట్ల దృష్టి సారించాలని, వృత్తిగా కాకుండా బాధ్యతతో సేవ చేయాలని సూచించారు.
RMO చంద్ర శేకర్, డా.శశికాంత్ రెడ్డి,.వైద్యులు, తదితరులు ఉన్నారు.