బుధవారం రాత్రి మాక్ డ్రిల్ ..
ఉప్పు ఎఫెక్ట్!
J. Surender Kumar,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంపై బుధవారం రాత్రి 10 మంది టెర్రరిస్టులు అటాక్ చేసి భక్తులను ఐజాక్ చేసినట్టుగా, అక్టోపస్ బలగాలు, కౌంటర్ అటాక్ చేసి. వారిని సురక్షితంగా విడిపించినట్టు మాక్ డ్రిల్ నిర్వహించారు.

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో డీ ఎస్పీ ప్రకాష్ పర్యవేక్షణలో అక్టోపస్ బలగాలు, ఆక్టోపస్ డిఎస్పి శ్రీనివాసరావు, ఆ టీమ్ సభ్యుల మాక్ డ్రిల్ నిర్వహించారు. దాదాపు 120 మంది సాయుధ పోలీసు బలగాలు. కౌంటర్ ఎటాక్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఇందులో ఆక్టోపస్ బలగాలు 60 మంది,. స్థానిక బలగాలు 60. మంది పాల్గొన్నారు.

టెర్రరిస్టులు ఆలయంలో చొరబడడం నిజం కాదని, ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ లో భాగమని అని మల్యాల ఎస్ఐ చిరంజీవి స్పష్టం చేశారు.
ఉప్పు ఎఫెక్ట్ !

ఈ నెల 9న * ఆలయాల్లో భక్తుల భద్రతకు చర్యలు ఏమి? * శీర్షిక న ‘ ఉప్పు’ లో వార్త కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆక్టోపస్ బలగాలు, బుధవారం రాత్రి కొండగట్టు ఆలయం లో మాక్ డ్రిల్ నిర్వహించడం ప్రత్యేకత.