ప్రజావాణిలో జగిత్యాల కలెక్టర్ కు..
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయాల్లో ప్రసాదం తయారీకీ వినియోగించే సామాగ్రిపై విచారణ జరిపించాలి అంటూ ఈ నెల 2న జరిగిన ప్రజావాణిలో జగిత్యాల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ చెందిన సామాజిక కార్యకర్త ఆకునూరి సురేష్
.
ఫిర్యాదు చేశారు.
కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో ప్రసాదం తయారీకీ వినియోగించే సామాగ్రి, స్థానిక మార్కెట్ ధరల కంటే అధిక ధరలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా సంబంధిత అధికారులు వ్యాపారి పేర్కొన్న ధరలకే డబ్బులు చెల్లిస్తున్నారని. ఫిర్యాదులో పేర్కొన్నారు

హైదరాబాద్ కు చెందిన టెండర్ దారులు, మినహ ఇంత వరకు ఆలయాలకు ఎవరు సామాగ్రి సప్లయ్ చేయడం లేదని, దీనతంటికి కారణం అధికారులు, కేవలం ఒకే ఒక్క సంస్థకు మాత్రమే అన్ని అర్హతలు ఉండే విధంగా నిబంధనలు సవరించారు ఆని పేర్కొన్నారు. ఉదహరణకు గ్రామాల్లోనే నిత్యవసర సామాగ్రి తక్కువ ధరకు కొనుగోలు కోసం ప్రజలు *డిమార్ట్ * *వాల్మార్ట్* హోల్సెల్ దుకాణాల్లోకి వెళ్లి సామాగ్రి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు
.

ఆలయ అధికారులు మాత్రం తమ వంతుగా ఆలోచన చేయాల్సి. ఉండగా అధిక ధరలకు సామాగ్రి కొనుగోలు చేయడం కోరకు ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నడు. నూతన దుకాణ దారులు తక్కువ లాభంతో ముందుకు వచ్చి సామాగ్రిని సరఫరా చేద్దామని ఆసక్తి వ్యక్తం చేసిన ,నిబంధనలు అడ్డువస్తున్నాయని, ముందుగా ప్రవేశ రుసుము తగ్గించి, టర్న్ ఓవర్, అగ్ మార్క్ సర్టిఫికెట్లు, లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నాణ్యమైన వస్తువులు అతి తక్కువ లాభం ఆశించి అందించే దుకాణదారులు, టెండర్రులు, చాలా మంది ఉన్నారన్నారు. దీంతో ఆలయ ఆదాయం వృధా కాకుండా ఉంటుందన్నారు. .అధికారులు స్పందించి నిబంధనలు తగ్గించేలా, చూడాలన్నారు. ఫిర్యాదుదారు వెంట భక్తులు కూనవేని రాజశేఖర్, బొయిని గంగాధర్, విక్రమ్ తదితరులు ఉన్నారు.
సత్వర పరిష్కారం చూపండి కలెక్టర్ రవి!

ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు, దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు మందా మకరంద్, తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల,అధికారులు దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ, భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజావాణిలో 17 ఫిర్యాదులు, వినతి పత్రాలు వచ్చాయి