( J.Surender Kumar)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. అర్చక స్వాములు, తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాన్ని తిలకించడానికి తెల్లవారుజాము నుంచి భక్తజనం ఆలయానికి బారులు తీరారు. అందంగా అలంకరించిన పూల మంటపం ,వేదిక భక్తులను తన్మయులను చేసింది. భక్తులకు సౌకర్యాలు కల్పన కోసం పాలకవర్గం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు.
రేపు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి రాక ?
తెలంగాణ శాసనసభ సభాపతి, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వామి దర్శనం, ప్రత్యేక పూజది కార్యక్రమం, మొక్కులు చెల్లించుకోవడం కోసం మంగళవారం కొండగట్టు క్షేత్రానికి రానున్నట్టు సమాచారం. అధికారికంగా స్పీకర్ పర్యటన ఖరారు కాలేదు. అయితే స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సోమవారం ఆలయ, కొండగట్టు ప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షించి పారిశుధ్యం,తదితర అంశాలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యక్తి రానున్నట్టు అక్కడ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే అనుచరుల చర్చల సారాంశం. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేకుండా కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం కోసం వస్తున్నట్లు సమాచారం