కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు!
(J. Surender Kumar)
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయ పద్ధతి మేరకు స్పీకర్ కు ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు పూల కుంభ స్వాగతం పలికారు.

స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు, వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత, మల్యాల సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, కొడిమెల మల్యాల జెడ్పిటిసి సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు స్పీకర్ కు స్వాగతం పలికారు

. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేలాది కోట్ల నిధులతో భద్రాద్రి ఆలయ నిర్మాణం, కొండగట్టు క్షేత్రానికి 100 కోట్ల నిధులు కేటాయింపు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ముందుగా స్పీకర్ పోలీసుల గార్డెన్ ఆఫ్ ఆనర్ ను స్వీకరించారు.

స్పీకర్ రాక సందర్భంగా రెండు గంటలపాటు భక్తులు స్వామివారి కోసం వేచి ఉన్న ఆలయ అధికారులు భక్తులు ఇబ్బందులు పడ్డారు.